logo

ఎత్తిపోతల పథకాల పరిశీలన

కొండంగిలో నిర్మించిన రెండు ఎత్తిపోతల పథకాలను పూర్తిస్థాయి వినియోగంలోకి తీసుకొచ్చే దిశగా చర్యలు చేపట్టినట్లు ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు తెలిపారు. రాష్ట్ర నీటిపారుదల అభివృద్ధి కార్పొరేషన్‌ ఇంజినీరింగ్‌ అధికారులతో కలిసి పథకాల పనితీరును

Published : 21 Jan 2022 03:11 IST

సాగునీటి సరఫరాను పరిశీలిస్తున్న ఎమ్మెల్యే నాగేశ్వరరావు

కొండంగి (కలిదిండి), న్యూస్‌టుడే: కొండంగిలో నిర్మించిన రెండు ఎత్తిపోతల పథకాలను పూర్తిస్థాయి వినియోగంలోకి తీసుకొచ్చే దిశగా చర్యలు చేపట్టినట్లు ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు తెలిపారు. రాష్ట్ర నీటిపారుదల అభివృద్ధి కార్పొరేషన్‌ ఇంజినీరింగ్‌ అధికారులతో కలిసి పథకాల పనితీరును గురువారం పరిశీలించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ పథకాల ద్వారా దిగువనున్న వేలాది ఎకరాలకు సాగునీటిని సరఫరా చేయనున్నట్లు చెప్పారు. ఏపీ ఎస్‌ఐడీసీ డీఈఈ ప్రభాకర్‌శర్మ, ఎంపీపీ చందన ఉమామహేశ్వరరావు, మార్కెట్‌ కమిటీ ఛైర్మన్‌ నీలపాల వెంకటేశ్వరరావు, అయినాల బ్రహ్మాజీ, పడవల శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని