logo

విద్యార్థులు 67... ఉపాధ్యాయుడు ఒక్కరే

మండలంలోని పెనుగొలను ప్రధాన ప్రాథమిక పాఠశాలలో 67 మంది విద్యార్థులకు ఒక్కరే ఉపాధ్యాయుడు ఉన్నారు. బడిలో ఉండే ఒకట్రెండు తరగతుల పిల్లలను అల్లరి చేయకుండా నియంత్రిస్తూ సంరక్షించడానికే ఉపాధ్యాయునికి సమయం సరిపోతుంది. గతేడాది 

Published : 23 Jan 2022 03:11 IST

మండలంలోని పెనుగొలను ప్రధాన ప్రాథమిక పాఠశాలలో 67 మంది విద్యార్థులకు ఒక్కరే ఉపాధ్యాయుడు ఉన్నారు. బడిలో ఉండే ఒకట్రెండు తరగతుల పిల్లలను అల్లరి చేయకుండా నియంత్రిస్తూ సంరక్షించడానికే ఉపాధ్యాయునికి సమయం సరిపోతుంది. గతేడాది అమలు చేసిన విలీన ప్రక్రియలో భాగంగా విద్యాలయంలోని 3,4,5 తరగతుల విద్యార్థులను పక్కనే ఉన్న జడ్పీ ఉన్నత పాఠశాలకు తరలించారు. ఇక్కడున్న నలుగురు ఉపాధ్యాయుల్లో ఇద్దర్ని విలీనంలో భాగంగా ఉన్నత పాఠశాలకు బదలాయించగా మరొకరు దీర్ఘకాలిక సెలవులో ఉన్నారు. మిగిలిన ఒక్కరే 1,2 తరగతులకు చెందిన 67 మంది విద్యార్థులకు బోధించాల్సి వస్తోంది. ఇక్కడ మరొకర్ని నియమించి, తమ పిల్లలకు పాఠాలు బోధించేందుకు అసౌకర్యం లేకుండా చూడాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. -న్యూస్‌టుడే, పెనుగొలను(గంపలగూడెం)

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని