logo

మాస్క్‌ ధరిస్తేనే సరకులివ్వండి

వినియోగదారులు మాస్క్‌ ధరించి వస్తేనే సరకులు ఇవ్వాలని తహసీల్దారు ఎల్వీఎస్‌ రామకృష్ణ దుకాణదారులకు సూచించారు. కలిదిండి ప్రధాన కూడలిలో ‘నోమాస్క్‌ - నోఎంట్రీ’ కార్యక్రమంలో భాగంగా రెవెన్యూ, పంచాయతీ ఉద్యోగులు శనివారం అవగాహన ర్యాలీ

Published : 23 Jan 2022 03:11 IST

కైకలూరు: మాస్కులు లేని వారి నుంచి జరిమానా వసూలు చేస్తున్న అధికారులు

కలిదిండి, న్యూస్‌టుడే: వినియోగదారులు మాస్క్‌ ధరించి వస్తేనే సరకులు ఇవ్వాలని తహసీల్దారు ఎల్వీఎస్‌ రామకృష్ణ దుకాణదారులకు సూచించారు. కలిదిండి ప్రధాన కూడలిలో ‘నోమాస్క్‌ - నోఎంట్రీ’ కార్యక్రమంలో భాగంగా రెవెన్యూ, పంచాయతీ ఉద్యోగులు శనివారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. దుకాణదారులు, ఇతర సిబ్బంది మాస్క్‌ ధరించకుంటే జరిమానా విధించడమే కాక కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.

రూ.వంద కట్టాల్సిందే.. కైకలూరు: కరోనా విస్తరిస్తున్న తరుణంలో ప్రతి ఒక్కరూ మాస్క్‌ ధరించి బయటకు రావాలని పంచాయతీ, రెవెన్యూ, పోలీసు అధికారులు సూచించారు. మూడు శాఖల ఆధ్యర్యంలో శనివారం పట్టణంలో మాస్కులు లేకుండా సంచరిస్తున్న వారికి రూ.100 చొప్పున జరిమానా విధించారు. ఆర్‌.ఐ ప్రసాద్‌, పట్టణ ఏఎస్సై పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని