logo

అరాచకపాలనను అడ్డుకుంటాం

గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలో కొనసాగుతున్న అరాచక పాలనను అడ్డుకుంటామని మాజీ ఎంపీ, తెదేపా మచిలీపట్నం నియోజకవర్గ పార్లమెంట్‌ పార్టీ అధ్యక్షుడు కొనకళ్ల నారాయణరావు అన్నారు. పార్టీ కార్యాలయంలో శనివారం నిర్వహించిన సమావేశంలో

Published : 23 Jan 2022 03:11 IST

మాట్లాడుతున్న కొనకళ్ల. వేదికపై బుల్లయ్య, బాబాప్రసాద్‌ తదితరులు

మచిలీపట్నం (కోనేరుసెంటరు), న్యూస్‌టుడే: గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలో కొనసాగుతున్న అరాచక పాలనను అడ్డుకుంటామని మాజీ ఎంపీ, తెదేపా మచిలీపట్నం నియోజకవర్గ పార్లమెంట్‌ పార్టీ అధ్యక్షుడు కొనకళ్ల నారాయణరావు అన్నారు. పార్టీ కార్యాలయంలో శనివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ గుడివాడ క్యాసినోపై నిజనిర్ధారణకు వెళ్లిన తెదేపా నాయకులకు రక్షణ కల్పించడంలో పోలీస్‌ యంత్రాంగం పూర్తిగా విఫలమైందన్నారు. నిజనిర్ధారణకు తాము గుడివాడ వెళ్తున్నామంటూ ముందస్తు సమాచారం ఇచ్చినా రక్షణ కల్పించాల్సిన పోలీసులు అందుకు విరుద్ధంగా వ్యవహరించడం సిగ్గుచేటన్నారు. తమపై దాడులకు పాల్పడిన వారిపై కేసులు నమోదు చేయకుండా తమనే నిందితులుగా ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పింఛనుదారులపై జగన్‌ ఉక్కుపాదం మోపారన్నారు. గుడివాడ క్యాసినో వ్యవహారాన్ని అన్ని స్థాయిల్లో నిరూపించే వరకూ తెదేపా పోరాటం చేస్తూనే ఉంటుందన్నారు. పార్టీ నాయకులు కొనకళ్ల జగన్నాథరావు(బుల్లయ్య), మోటమర్రి బాబాప్రసాద్‌, సోమశేఖర్‌, ఇలియాస్‌పాషా, భాగ్యారావు, సమతాకీర్తి, సుధాకర్‌, లంకిశెట్టి నీరజ పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని