logo

బాధితులను తక్షణం ఆదుకోవాలి

అగ్నిప్రమాద బాధితులను ప్రభుత్వం తక్షణం ఆదుకోవాలని తెదేపా నియోజకవర్గ ఇన్‌ఛార్జి కాగిత కృష్ణప్రసాదు డిమాండ్‌ చేశారు. శనివారం ఆయన గ్రామంలో ఇటీవలజరిగిన అగ్నిప్రమాద బాధితులు బూరగడ్డ రంగారావును పరామర్శించి ఘటనకు కారణాలు అడిగి

Published : 23 Jan 2022 03:11 IST

అగ్నికి దగ్ధమైన ఇంటిని పరిశీలిస్తున్న కాగిత కృష్ణప్రసాదు, నాయకులు

కంకటావ(గూడూరు),న్యూస్‌టుడే: అగ్నిప్రమాద బాధితులను ప్రభుత్వం తక్షణం ఆదుకోవాలని తెదేపా నియోజకవర్గ ఇన్‌ఛార్జి కాగిత కృష్ణప్రసాదు డిమాండ్‌ చేశారు. శనివారం ఆయన గ్రామంలో ఇటీవలజరిగిన అగ్నిప్రమాద బాధితులు బూరగడ్డ రంగారావును పరామర్శించి ఘటనకు కారణాలు అడిగి తెలుసుకున్నారు. ఈసందర్భంగా ఆయన తనవంతుగా బియ్యం, నిత్యావసర సరుకులతోపాటు ఆర్థిక సాయం అందించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్వస్వం కొల్పోయిన కుటుంబానికి త్వరిగతిన ఇల్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. పార్టీపరంగా ఆ కుటుంబానికి అన్నివిధాలుగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. అనంతరం గ్రామంలోని మెండు ప్రభాకర్‌ కుటుంబసభ్యులను పరామర్శించారు. నారికేడలపాలెంలో ఇటీవల మృతిచెందిన తెదేపా సీనియర్‌ నాయకులు, మాజీ సర్పంచి వేమూరి గంగయ్య ఇంటికి వెళ్లి కుటుంబసభ్యులను పరామర్శించడంతోపాటు గంగయ్య చిత్రపటానికి నివాళులు అర్పించారు. పార్టీ మండలఅధ్యక్షులు పోతన లక్ష్మీనరసింహస్వామి, సర్పంచి మోహన్‌రావు, గోపి నాగబాబు, తెలుగుయువత రాష్ట్రకార్యదర్శి ఎన్‌ఏబేగ్‌, తోట పోతురాజు, వాకా శ్రీనివాసరావు, బొర్రా శ్రీను, నాగరాజు, ఆలపాటి సత్యనారాయణ, సిరివెళ్ల శ్రీనివాసరావు, కిరణ్‌, గోవర్థన్‌, తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని