logo

రైతుల అభ్యున్నతిలో సహకార సంఘాల పాత్ర కీలకం

రైతులకు అత్యధిక రుణాలు ఇచ్చి అనేక అవార్డులు పొందిన ఘనత సహకార సంఘాలదేనని కేడీసీసీ బ్యాంక్‌ ఛైర్మన్‌ తన్నీరు నాగేశ్వరరావు పేర్కొన్నారు. మోపిదేవి సహకార

Updated : 23 Jan 2022 19:17 IST

మోపిదేవి : రైతులకు అత్యధిక రుణాలు ఇచ్చి అనేక అవార్డులు పొందిన ఘనత సహకార సంఘాలదేనని కేడీసీసీ బ్యాంక్‌ ఛైర్మన్‌ తన్నీరు నాగేశ్వరరావు పేర్కొన్నారు. మోపిదేవి సహకార పరపతి సంఘం నిధులు రూ.18.50లక్షలు, కేడీసీసీ బ్యాంక్‌ నిధులు రూ.7లక్షలతో నిర్మించిన 250 మెట్రిక్‌ టన్నుల సామర్థ్యం గల నూతన గోదామును ఆయన ప్రారంభించారు. సంఘం ఛైర్‌పర్సన్‌ కె.సురేశ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ సహకార సంఘాల ద్వారా రైతులకు వ్యవసాయ, వ్యవసాయేతర రుణాలను 60శాతం అందిస్తూ అగ్రస్థానంలో నిలిచిన బ్యాంక్‌ కేడీసీసీ అని చెప్పారు. అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేశ్‌బాబు మాట్లాడుతూ రైతులు తీసుకున్న రుణాలను సకాలంలో చెల్లిస్తే రాష్ట్ర ప్రభుత్వం వడ్డీ రాయితీ ఇస్తోందని తెలిపారు. సీఎం ఆదేశాల మేరకు త్వరలో సహకార సంఘాల వద్ద ఏటీఎంలు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ ఛైర్మన్‌ కె. నరసింహారావు, మోపిదేవి సర్పంచ్‌ మేరీ రాణి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని