logo

ఉద్యమం కొనసాగిస్తాం

ఉద్యోగుల డిమాండ్లు పరిష్కరించకపోతే ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం అవుతుందని ఏపీ జేఏసీ ఛైర్మన్‌ వుల్లి కృష్ణ హెచ్చరించారు. ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికులు, విశ్రాంత ఉద్యోగుల న్యాయబద్ధమైన కోర్కెలను ప్రభుత్వం పరిష్కరించాలని కోరుతూ పీఆర్‌సీ సాధన సమితి ఆధ్వర్యంలో చేపట్టిన

Published : 27 Jan 2022 02:32 IST

ఏపీ జేఏసీ ఛైర్మన్‌ వుల్లి కృష్ణ


జాతీయ పతాకంతో ర్యాలీ చేస్తున్న ఉద్యోగులు

మచిలీపట్నం కార్పొరేషన్‌,న్యూస్‌టుడే: ఉద్యోగుల డిమాండ్లు పరిష్కరించకపోతే ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం అవుతుందని ఏపీ జేఏసీ ఛైర్మన్‌ వుల్లి కృష్ణ హెచ్చరించారు. ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికులు, విశ్రాంత ఉద్యోగుల న్యాయబద్ధమైన కోర్కెలను ప్రభుత్వం పరిష్కరించాలని కోరుతూ పీఆర్‌సీ సాధన సమితి ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. బుధవారం మచిలీపట్నంలో ఉద్యోగ సంఘాల నాయకులు, ఉద్యోగులు పాల్గొని ధర్నాచౌక్‌ నుంచి 200 అడుగుల జాతీయ పతాకంతో లక్ష్మీటాకీసు కూడలి వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం కూడలిలోని అంబేడ్కర్‌ విగ్రహానికి వినతిపత్రం అందించారు. ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేస్తూ తమ డిమాండ్ల సాధనకు ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ సాధన సమితి ఇచ్చిన పిలుపు మేరకు నిరసన కార్యక్రమాలు కొనసాగుతూనే ఉంటాయన్నారు. జేఏసీ అమరావతి ఛైర్మన్‌ నెల్సన్‌పాల్‌ బాబు, జేఎసీ కన్వీనర్‌ దారపు శ్రీనివాస్‌, ట్రెజరీ ఉద్యోగుల సంఘ రాష్ట్ర అధ్యక్షుడు శోభన్‌బాబు, మున్సిపల్‌ ఉద్యోగ సంఘ నాయకులు సమ్మెట వెంకటేష్‌లతోపాటు వివిధ సంఘాల నాయకులు పి.రాము, కె.సునీల్‌కుమార్‌, ఆకూరి శ్రీనివాసరావు, సాయికుమార్‌, లెనిన్‌బాబు, తమ్ము నాగరాజు, ఎ.వెంకటేశ్వరరావు, రాజేంద్రప్రసాదు, హుస్సేన్‌, గౌరి, జాస్మిన్‌ తదితరులతోపాటు ఉద్యోగులు పాల్గొన్నారు.

నేటి నుంచి రిలేదీక్షలు : ఉద్యమంలో భాగంగా గురువారం నుంచి రిలే దీక్షలు ప్రారంభిస్తున్నట్లు సంఘ నాయకులు తెలిపారు. మచిలీపట్నంలోని ధర్నాచౌక్‌లో ఉదయం 9 నుంచి సాయంత్రం 5గంటల వరకు దీక్ష జరుగుతుందన్నారు.అన్ని సంఘాల నాయకులు, ఉద్యోగులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని