logo

ప్రభుత్వానికి దిశానిర్దేశం చేయండి

తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ పీఆర్సీ సాధన సమితి, ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో బుధవారం తిరువూరులో ఆందోళన చేపట్టారు. ప్లకార్డులు చేతబూని పట్టణ ప్రధాన వీధుల్లో నిరసన ప్రదర్శన నిర్వహించారు

Published : 27 Jan 2022 02:32 IST

పీఆర్‌సీ జీవోలపై అంబేడ్కర్‌ విగ్రహాలకు ఉద్యోగుల వినతి

కైకలూరు: అంబేడ్కర్‌ విగ్రహానికి వినతిపత్రం అందిస్తున్న ఉద్యోగ సంఘం నాయకులు

తిరువూరు, న్యూస్‌టుడే: తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ పీఆర్సీ సాధన సమితి, ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో బుధవారం తిరువూరులో ఆందోళన చేపట్టారు. ప్లకార్డులు చేతబూని పట్టణ ప్రధాన వీధుల్లో నిరసన ప్రదర్శన నిర్వహించారు. స్థానిక బోసుబొమ్మ కూడలి వద్ద అంబేడ్కర్‌ విగ్రహం ఎదుట ధర్నా చేశారు. 11వ వేతన సవరణను మధ్యంతర భృతి కంటే తక్కువగా ప్రకటించడం, ఐదేళ్లకు ఇవ్వాల్సిన పీఆర్సీని పదేళ్లకు పెంచుతామని ప్రకటించడం అన్యాయమన్నారు. సీపీఎస్‌ రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. సంఘాల నాయకులు ఎం.శ్రీనివాస్‌, జి.గోపాలకృష్ణ, ప్రకాశ్‌బాబు, బాలరాజు, డి.అపర్ణ పాల్గొన్నారు.

తిరువూరు: పీఆర్సీకి సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన జీవోలను వెనక్కి తీసుకోవాలని న్యాయశాఖ ఉద్యోగులు డిమాండ్‌ చేశారు. స్థానిక జేఎఫ్‌సీఎం కోర్టు ఆవరణలో బుధవారం జరిగిన గణతంత్ర వేడుకల అనంతరం అంబేడ్కర్‌ చిత్రపటానికి వినతిపత్రం అందజేశారు. ఉద్యోగుల ఆందోళనకు బార్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో న్యాయవాదులు మద్దతు తెలిపారు. సూపరింటెండెంట్‌ దుర్గారావు, అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి కొత్తపల్లి ఆనందస్వరూప్‌, న్యాయవాదులు ఎం.నాగేంద్రప్రసాద్‌, ఎ.శ్రీనివాసరావు, ఎం.సత్యం తదితరులు పాల్గొన్నారు.

గంపలగూడెం: పాత పీఆర్సీ, వేతనాలు అమలు చేయాలని కోరుతూ మండలంలోని ఉపాధ్యాయులు బుధవారం తోటమూలలో అంబేడ్కర్‌ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. పీఆర్సీ సాధన సమితి మండల సంఘం నాయకులు ఎన్‌.రమణారావు, కె.మోహన్‌రావు, ఎం.జయశీలనరావు, ఎన్‌.నరసింహారావు, బి.జమలయ్య, కె.శ్రీనివాసరావు, పి.వసంతరావు, ఎన్జీవోల సంఘం ప్రతినిధి ఎ.రామచంద్రరావు తదితరుల ఆధ్వర్యంలో నినాదాలు చేశారు.

విస్సన్నపేట: పీఆర్సీ సాధన సమితి, సంయుక్త కార్యాచరణ సమితుల పిలుపు మేరకు పెద్దసంఖ్యలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు స్థానిక అంబేడ్కర్‌ కూడలిలో విగ్రహానికి వినతిపత్రాలు అందజేశారు. ఏపీఎన్జీవో సంఘం అధ్యక్షుడు రవికుమార్‌, ఉద్యోగ, ఉపాధ్యాయసంఘాల నేతలు ఎన్‌.సూరిరాజు, టి.అరుణ, బీవీ.రామారావు, ఆర్‌.నాగేశ్వరరావు, బీసీహెచ్‌.సూర్యనారాయణ, జేటీ రాజేంద్రప్రసాద్‌, కె.రంగా పాల్గొన్నారు.

బంటుమిల్లి, న్యూస్‌టుడే: స్థానిక అంబేడ్కర్‌ కూడలి వద్ద పీఆర్‌సీ సాధన సమితి ఆధ్వర్యంలో బుధవారం ఉద్యోగ సంఘాల నాయకులు నిరసన వ్యక్తం చేశారు. నాయకులు ఎం యేసుదాసు, శేషారావు, రాంబాబు, రేణుకారావు, ఫణి భాస్కర్‌, తదితరులు పాల్గొన్నారు.

కైకలూరు, న్యూస్‌టుడే: స్థానిక ఎన్జీవోస్‌ కార్యాలయం నుంచి తాలూకా కూడలి వరకు ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు బుధవారం ర్యాలీ నిర్వహించారు. అంబేడ్కర్‌ విగ్రహానికి వినతిపత్రం అందించి వినూత్న నిరసన వ్యక్తం చేశారు. అంబేడ్కర్‌ స్ఫూర్తితో ఉద్యమాన్ని కొనసాగిస్తున్నామన్నారు. కార్యక్రమంలో నాయకులు కేపీరావు, కట్టా శ్రీనివాసరావు, శ్యామసుందర్‌, డీటీ రాంబాబు, ఇబ్రహీం, వర్మ, వీరగాని రామారావు, బాబురావు, తాతారావు, విష్ణుమూర్తి తదితరులు పాల్గొన్నారు.


తిరువూరు: నినాదాలు చేస్తున్న న్యాయశాఖ ఉద్యోగులు

అభ్యంతరాలు పరిశీలించండి

కలెక్టరేట్‌(మచిలీపట్నం): రివైజ్డ్‌ పేస్కేల్‌ ఉత్తర్వులపై ఉపాధ్యాయ, ఉద్యోగులు లేవనెత్తిన పలు అంశాలపై సాధ్యాసాధ్యాలను పరిశీలించాలంటూ శాసనమండలి సభ్యురాలు పి.కల్పలత మంత్రి పేర్ని నానిని కోరారు. రహదారులు, భవనాల శాఖ అతిథిఫగృహంలో బుధవారం మంత్రిని కలిసిన ఎమ్మెల్సీ రివైజ్డ్‌ పేస్కేల్‌పై వినతిపత్రాన్ని అందజేశారు. ప్రభుత్వం జారీ చేసిన జీవోనెం.127లోని పలు అంశాలపై ఉద్యోగ సంఘాలు తమ అభ్యంతరాలను తెలుపుతున్నాయని, సంఘాలతో చర్చించేందుకు ప్రభుత్వం నియమించిన కమిటీలో సభ్యుడిగా వాటిని పరిశీలించి త్వరితగతిన పరిష్కార మార్గం చూపేలా చొరవ చూపాలని మంత్రిని కోరారు.

 

బంటుమిల్లి: అంబేడ్కర్‌ విగ్రహం వద్ద నిరసన

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని