logo

ఫిబ్రవరి 26న ట్రిపుల్‌ ఐటీ స్నాతకోత్సవం

రాజీవ్‌గాంధీ వైజ్ఞానిక, సాంకేతిక విశ్వవిద్యాలయం (ఆర్జీయూకేటీ) పరిధిలోని ఇడుపులపాయ, నూజివీడు ట్రిపుల్‌ ఐటీల్లో ఆరేళ్ల ఇంజినీరింగ్‌ కోర్సు పూర్తి చేసిన 6వేల మంది విద్యార్థులకు స్నాతకోత్సవం నిర్వహించి పట్టాలు ఇవ్వాల్సి ఉంది. ఈ కార్యక్రమాన్ని గత ఏడాది డిసెంబరు 24న నిర్వహించి ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి

Published : 27 Jan 2022 05:42 IST

వేంపల్లె, న్యూస్‌టుడే: రాజీవ్‌గాంధీ వైజ్ఞానిక, సాంకేతిక విశ్వవిద్యాలయం (ఆర్జీయూకేటీ) పరిధిలోని ఇడుపులపాయ, నూజివీడు ట్రిపుల్‌ ఐటీల్లో ఆరేళ్ల ఇంజినీరింగ్‌ కోర్సు పూర్తి చేసిన 6వేల మంది విద్యార్థులకు స్నాతకోత్సవం నిర్వహించి పట్టాలు ఇవ్వాల్సి ఉంది. ఈ కార్యక్రమాన్ని గత ఏడాది డిసెంబరు 24న నిర్వహించి ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి చేతులమీదుగా పట్టాలు అందించాలని నిర్ణయించారు. ముఖ్యమంత్రికి తీరిక లేని పనుల కారణంగా అప్పుడు వాయిదా పడింది. తిరిగి ఈ ఏడాది జనవరి 30న నిర్వహించాలని నిర్దేశించుకున్నా ప్రస్తుతం కరోనా కేసులు పెరుగుతున్నందున మరోసారి వాయిదా పడింది. కరోనా ఉద్ధృతి కారణంగా స్నాతకోత్సవ తేదీని వచ్చే నెల 26కు వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు వర్సిటీ కులపతి ఆచార్య కేసీరెడ్డి బుధవారం పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని