logo

వినియోగిస్తే మరింత సొబగు

గ్రామాల్లో చెత్త సమస్య పరిష్కారానికి, చెత్త నుంచి సంపద సృష్టించి పంచాయతీలకు ఆదాయం సమకూర్చే సదాశయంతో మండలంలోని అన్ని గ్రామపంచాయతీల్లో చెత్తసంపద కేంద్రాలను నిర్మించారు. 2018లో మండలంలోని 32 పంచాయతీల్లో ఒక్కొక్కటి చొప్పున జాతీయ ఉపాధి హామీ పథకంలో సుమారు రూ.6లక్షల వ్యయంతో

Published : 27 Jan 2022 05:42 IST


రంగులద్దుకున్న పెనుమల్లి కేంద్రం

ముదినేపల్లి, న్యూస్‌టుడే: గ్రామాల్లో చెత్త సమస్య పరిష్కారానికి, చెత్త నుంచి సంపద సృష్టించి పంచాయతీలకు ఆదాయం సమకూర్చే సదాశయంతో మండలంలోని అన్ని గ్రామపంచాయతీల్లో చెత్తసంపద కేంద్రాలను నిర్మించారు. 2018లో మండలంలోని 32 పంచాయతీల్లో ఒక్కొక్కటి చొప్పున జాతీయ ఉపాధి హామీ పథకంలో సుమారు రూ.6లక్షల వ్యయంతో చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాలను నిర్మించారు. అప్పటి నుంచి వాటిని వినియోగంలోకి తీసుకురాకపోవటంతో ముళ్లకంపలతో నిండిపోయాయి. చెత్తసంపద కేంద్రాలు ఉన్నా పంచాయతీ అధికారులు సేకరించిన చెత్తనంతా రహదారుల పక్కన, శ్మశానవాటికల్లో పోస్తూ వాటిని డంపింగ్‌ యార్డులుగా మార్చేస్తున్నారు. తాజాగా ఆ కేంద్రాలకు ఉపాధి హామీ పథకంలో భాగంగా రంగులు వేస్తున్నారు. గతంలో మాదిరి నిధులు వెచ్చించి రంగులు వేసి వదిలేయకుండా ఇప్పటికైనా వినియోగంలోకి తీసుకువస్తేనే ఫలితం ఉంటుందని ప్రజలు కోరుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని