logo

పాఠశాలలో తాగునీటికి రూ.80 వేల అందజేత

మండలంలోని దుందిరాలపాడు ప్రాథమికోన్నత పాఠశాలకు ప్రవాసాంధ్రురాలు కంఠంనేని హేమ రూ.80 వేలు వితరణగా అందించారు. ఆ నగదుతో బడిలో విద్యార్థులకు శుద్ధజలం అందించేందుకు మోటారు, యంత్రం కొనుగోలు చేసినట్లు ప్రధానోపాధ్యాయుడు డాక్టర్‌ ఎస్‌.వి.ఎస్‌.శాస్త్రి తెలిపారు. బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో

Published : 27 Jan 2022 05:42 IST

దాత ఏర్పాటు చేసిన శుద్ధజల యంత్రం ప్రారంభిస్తున్న దృశ్యం

దుందిరాలపాడు(గంపలగూడెం), న్యూస్‌టుడే: మండలంలోని దుందిరాలపాడు ప్రాథమికోన్నత పాఠశాలకు ప్రవాసాంధ్రురాలు కంఠంనేని హేమ రూ.80 వేలు వితరణగా అందించారు. ఆ నగదుతో బడిలో విద్యార్థులకు శుద్ధజలం అందించేందుకు మోటారు, యంత్రం కొనుగోలు చేసినట్లు ప్రధానోపాధ్యాయుడు డాక్టర్‌ ఎస్‌.వి.ఎస్‌.శాస్త్రి తెలిపారు. బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో దాత విరాళం అందించేందుకు కృషి చేసిన కె.అశోక్‌కుమార్‌ శుద్ధజల యంత్రాలను ప్రారంభించారు. పాఠశాల అభివృద్ధికి విశ్రాంత ఉపాధ్యాయుడు ఎన్‌.కాళేశ్వరరావు రూ.10 వేలు, వైకాపా నేత కె.సుధాకర్‌ రూ.7 వేలు అందించినట్లు హెచ్‌ఎం తెలిపారు. సర్పంచి బి.బాబూరావు, ఎంపీటీసీ సభ్యురాలు టి.వెంకట్రావమ్మ, పీఏసీఎస్‌ అధ్యక్షుడు వి.రాంబాబు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని