logo

గురుకులంలో విద్యార్థినులకు కొవిడ్‌

మండలంలోని బల్లిపర్రు బాలయోగి సాంఘిక సంక్షేమ బాలికల గురుకులంలో ముగ్గురు విద్యార్థినులకు కొవిడ్‌ నిర్ధరణైంది. బుధవారం గురుకులంలో 15 మందికి కొవిడ్‌ పరీక్షలు చేయగా గురువారం వచ్చిన ఫలితాల్లో

Published : 28 Jan 2022 02:17 IST

పెడన, న్యూస్‌టుడే: మండలంలోని బల్లిపర్రు బాలయోగి సాంఘిక సంక్షేమ బాలికల గురుకులంలో ముగ్గురు విద్యార్థినులకు కొవిడ్‌ నిర్ధరణైంది. బుధవారం గురుకులంలో 15 మందికి కొవిడ్‌ పరీక్షలు చేయగా గురువారం వచ్చిన ఫలితాల్లో 6వ తరగతి విద్యార్థినితో పాటు 7వ తరగతి చదువుతున్న ఇద్దరికి పాజిటివ్‌ వచ్చినట్లు స్థానిక పీహెచ్‌సీ ఆరోగ్య విస్తరణాధికారి ఎం.వీరయ్య చెప్పారు. గురుకులాన్ని తాత్కాలికంగా మూసేయాలని ప్రిన్సిపల్‌ సుజనీకి సూచించామని తెలిపారు.

పెడనలో 13 మందికి పాజిటివ్‌: పెడన పట్టణంలో అత్యధికంగా గురువారం 13 మందికి పాజిటివ్‌ నిర్ధరణైంది. మచిలీపట్నం ఆర్డీవో ఖాజావలి తెలిపిన వివరాల ప్రకారం.. పెడనలో మొత్తం 16 మంది వైరస్‌ నిర్ధరణ కాగా అందులో గురుకుల విద్యార్థినులు ముగ్గురు ఉన్నారు. థర్డ్‌ వేవ్‌ మొదలైన తర్వాత ఈ స్థాయిలో కేసులు రావటం ఇదే తొలిసారి. దీంతో వైద్యారోగ్యశాఖ అప్రమత్తమైంది. ఇప్పటి వరకు టీకాకు దూరంగా ఉన్న వ్యక్తులను గుర్తించి, వేయటం మొదలుపెట్టారు. 60 ఏళ్లు పైబడిన వారికి ప్రికాషనరీ డోస్‌ వేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు