logo

సామాజిక అంశాలపై అవగాహన

విద్యార్థి దశనుంచే ప్రతి ఒక్కరూ చదువుతోపాటు సామాజిక అంశాలపై కూడా అవగాహన పెంపొందించుకోవాలని డీవైఈవో యూవీ సుబ్బారావు అన్నారు. కోడిపందేలు, ఇతర జూదక్రీడల వల్ల కలిగే అనర్థా.లపై నగరంలోని హైనీ ఉన్నత పాఠశాలలో గురువారం

Published : 28 Jan 2022 02:17 IST

బహుమతి అందిస్తున్న డీవైఈవో,

హెచ్‌ఎంలు పాండురంగారావు, సాయిబాబు

మచిలీపట్నం (చిలకలపూడి), న్యూస్‌టుడే: విద్యార్థి దశనుంచే ప్రతి ఒక్కరూ చదువుతోపాటు సామాజిక అంశాలపై కూడా అవగాహన పెంపొందించుకోవాలని డీవైఈవో యూవీ సుబ్బారావు అన్నారు. కోడిపందేలు, ఇతర జూదక్రీడల వల్ల కలిగే అనర్థా.లపై నగరంలోని హైనీ ఉన్నత పాఠశాలలో గురువారం డివిజన్‌ స్థాయిలో నిర్వహించిన పోటీల్లో విజేతలకు జిల్లాస్థాయి పోటీలు నిర్వహించారు. వ్యాసరచన, వక్తృత్వం, క్విజ్‌ పోటీలు నిర్వహించగా ఆయా ప్రాంతాలకు చెందిన విద్యార్థులు పాల్గొన్నారు. వ్యాసరచన పోటీల్లో గిలకలదిండికి చెందిన కె.మహీంద్ర, చిలకలపూడికి చెందిన బి.శ్రావ్య వక్తృత్వంలో జె.తులసీప్రియ (చిలకలపూడి), జీవీ వసంతరావు(పెడన)లు ప్రథమ, ద్వితీయస్థానాలు సాధించారు. క్విజ్‌పోటీలో చిలకలపూడి పాండురంగ ఉన్నత పాఠశాలకు చెందిన ఎస్‌.ధనరేఖ, బి.శ్రావ్య, వై.నాగభవానీ, జె.తులసీప్రియల బృందం ప్రథమస్థానం సాధించగా, పెడన బీజీకే జడ్పీహెచ్‌ఎస్‌కు చెందిన జీవీ.వసంతరావు, ఏజెఎల్‌.శ్రీనివాస్‌, కె.అనూష, ఎన్‌.మాధవి బృందం ద్వితీయస్థానంలో నిలిచారు. ప్రధానోపాధ్యాయులు వెంట్రపాటి పాండురంగారావు, సాయిబాబు న్యాయనిర్ణేతలుగా వ్యవహరించగా పలువురు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని