logo

రెండు సర్వీసులున్నాఒకే బిల్లు

ఒక వినియోగదారుడికి ఒకటికి మించి విద్యుత్తు సర్వీసులుంటే ఒకే సర్వీసుగా పరిగణించి బిల్లులు జారీచేస్తామని సెంట్రల్‌ పవర్‌ డిస్ట్రిబ్యూషన్‌ కంపెనీ(సీపీడీసీఎల్‌) పెడన సబ్‌డివిజన్‌ డీఈఈ సీహెచ్‌.మాణిక్యాలరావు అన్నారు.శుక్రవారం ఆయన ‘న్యూస్‌టుడే’తో

Published : 29 Jan 2022 01:39 IST

సబ్‌డివిజన్‌లో 149 సర్వీసుల గుర్తింపు

డీఈఈ మాణిక్యాలరావు

పెడన, న్యూస్‌టుడే

ఒక వినియోగదారుడికి ఒకటికి మించి విద్యుత్తు సర్వీసులుంటే ఒకే సర్వీసుగా పరిగణించి బిల్లులు జారీచేస్తామని సెంట్రల్‌ పవర్‌ డిస్ట్రిబ్యూషన్‌ కంపెనీ(సీపీడీసీఎల్‌) పెడన సబ్‌డివిజన్‌ డీఈఈ సీహెచ్‌.మాణిక్యాలరావు అన్నారు.శుక్రవారం ఆయన ‘న్యూస్‌టుడే’తో మాట్లాడుతూ సబ్‌డివిజన్‌ పరిధిలోని పెడన, బంటుమిల్లి, కృత్తివెన్ను మండలాల్లో మొత్తం 149 ఈ తరహా సర్వీసులు గుర్తించామని చెప్పారు. దీనికోసం గత నెలలో సర్వే చేపట్టామని, భవిష్యత్తులోనూ ఇది కొనసాగుతుందన్నారు. రెండు సర్వీసులకు వేర్వేరు బిల్లుల ద్వారా శ్లాబు రేటులు తగ్గి, తక్కువ బిల్లులు వస్తాయని రెండింటినీ కలపడం ద్వారా శ్లాబు పెరుగుతుందని చెప్పారు.

మచిలీపట్నం-పెడన మధ్య కొత్తలైను: మచిలీపట్నం-పెడన మధ్య రూ.1.60 కోట్ల నిధులతో కొత్త లైను ఏర్పాటు పనులు పురోగతిలో ఉన్నాయన్నారు. మచిలీపట్నంలోని 132/33 కేవీ సబ్‌స్టేషన్‌ నుంచి పెడన తోటమూలలోని 33/11 కేవీ సబ్‌స్టేషన్‌ వరకు 14 కిమీల పొడవున కొత్తలైన్‌ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. దీన్ని పెడన నుంచి బంటుమిల్లి సబ్‌స్టేషన్‌కు వెళ్లే 11కేవీ లైన్‌కు అనుసంధానం చేస్తామని, ఫలితంగా బంటుమిల్లి, కృత్తివెన్ను మండలాలకు విద్యుత్తు అంతరాయాలు గణనీయంగా తగ్గుతాయని వివరించారు. బంటుమిల్లి నుంచి కృత్తివెన్ను మండలంలో ఇటీవల ఏర్పాటు చేసిన ఉప్పలూరు సబ్‌స్టేషన్‌ వరకు మచిలీపట్నం నుంచి నేరుగా సరఫరా జరుగుతుందని వెల్లడించారు.

పెడనలో 220 కేవీ సబ్‌స్టేషన్‌: పెడన కేంద్రంగా 220 కేవీ సబ్‌స్టేషన్‌ నిర్మాణానికి ప్రతిపాదనలు ఏపీ ట్రాన్స్‌కో వద్ద ఉన్నాయని డీఈఈ చెప్పారు. నడుపూరు-కూడూరు రహదారిపై ఈ సబ్‌స్టేషన్‌ను ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధమవుతోందన్నారు. పెడన నుంచి మచిలీపట్నం-విజయవాడ సెక్షన్‌లోని రైల్వే లైను విద్యుత్తును సరఫరా చేయాల్సి ఉంటుందని, ఆర్‌వీకే ఎనర్జీకి ఇక్కడి నుంచి సరఫరా చేస్తామని పేర్కొన్నారు. మచిలీపట్నం పోర్టు ఏర్పాటైతే పెడన నుంచి ఒక లైన్‌ పోర్టుకు వెళుతుందని తెలిపారు. అలాగే బంటుమిల్లి కేంద్రంగా 132 కేవీ సబ్‌స్టేషన్‌ ప్రతిపాదన ఏపీ ట్రాన్స్‌కో వద్ద ఉందని చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని