logo

ఆరునెలల్లో రూ.వెయ్యికోట్ల వ్యాపారం

తమ పాలకవర్గం ఏర్పడిన ఆరునెలల్లో రూ. వెయ్యికోట్ల వ్యాపారం చేశామని కేడీసీసీ బ్యాంకు ఛైర్మన్‌ తన్నీరు నాగేశ్వరరావు తెలిపారు. ప్రస్తుతం ఉన్న పాలకవర్గ గడువును పెంచడంతోపాటు ఒక సభ్యుడిని కొత్తగా నియమించడంతో శుక్రవారం మచిలీపట్నంలోని

Published : 29 Jan 2022 01:39 IST

కేడీసీసీ బ్యాంకు ఛైర్మన్‌ నాగేశ్వరరావు

పాలకవర్గసభ్యులతో సమావేశమైన ఛైర్మన్‌ నాగేశ్వరరావు

మచిలీపట్నం కార్పొరేషన్‌, న్యూస్‌టుడే: తమ పాలకవర్గం ఏర్పడిన ఆరునెలల్లో రూ. వెయ్యికోట్ల వ్యాపారం చేశామని కేడీసీసీ బ్యాంకు ఛైర్మన్‌ తన్నీరు నాగేశ్వరరావు తెలిపారు. ప్రస్తుతం ఉన్న పాలకవర్గ గడువును పెంచడంతోపాటు ఒక సభ్యుడిని కొత్తగా నియమించడంతో శుక్రవారం మచిలీపట్నంలోని బ్యాంకు ఆవరణలో సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఏడాది మార్చి నాటికి మరో వెయ్యికోట్ల వ్యాపారం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని అన్నారు. బ్యాంకు ద్వారా విస్తృత సేవలు అందిస్తున్నామని ఇందులో భాగంగానే బ్యాంకులోని సభ్యులకు ఎల్‌ఐసీ ద్వారా బీమా సౌకర్యం కల్పించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. జిల్లావ్యాప్తంగా ఆయా బ్రాంచిల్లో 18 నుంచి 59 ఏళ్ల వయసు కలిగిన వారికే బీమా వర్తిస్తుందని అలాంటి వారు 1.20లక్షల మంది ఉన్నట్లు గుర్తించామన్నారు. జిల్లా వ్యాప్తంగా స్వయం సహాయసంఘాలకు ఇచ్చే రుణపరిమితిని కూడా రూ.20లక్షలకు పెంచుతున్నామన్నారు. ప్రస్తుతం బ్యాంకు ద్వారా 8,500 సంఘాలు రుణాలు పొందుతున్నాయని, మరో 4వేల సంఘాలకు పెంచాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ఈ ఏడాది మార్చినాటికి రూ.500కోట్ల డిపాజిట్‌లు సేకరించేలా లక్ష్యాన్ని నిర్దేశించుకున్నామన్నారు. పాలకవర్గ సభ్యులు నల్లమోతు కోటిసూర్య ప్రకాశరావు, కొమ్మినేని రవిశంకర్‌, గుమ్మడపు రవీంద్రరాణా, గడిదేశి పెదవెంకయ్య, పడమట సుజాత, భూక్యారాణిలతోపాటు సీఈవో శ్యామ్‌మనోహర్‌, పలువురు అధికారులు పాల్గొన్నారు. ఛైర్మన్‌తోపాటు కొత్తగా సభ్యునిగా నియమితులైన రవీంద్రరాణాను పలువురు సభ్యులు సత్కరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని