logo

బాధితులకు న్యాయం చేయండి

సమాచార శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య(నాని)ని తాలూకా సీఐ ప్రసన్నవీరయ్యగౌడ్‌ శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. రూరల్‌ సీఐగా బాధ్యతలు స్వీకరించిన ఆయన మంత్రిని నివాసగృహంలో

Published : 29 Jan 2022 01:39 IST

మచిలీపట్నం(కోనేరుసెంటరు), న్యూస్‌టుడే: సమాచార శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య(నాని)ని తాలూకా సీఐ ప్రసన్నవీరయ్యగౌడ్‌ శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. రూరల్‌ సీఐగా బాధ్యతలు స్వీకరించిన ఆయన మంత్రిని నివాసగృహంలో కలిసి పూలమొక్కను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తాలూకా స్టేషన్‌ పరిధిలోని బాధితులకు సత్వర న్యాయం దక్కేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అనంతరం జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి మంత్రి అర్జీలు స్వీకరించారు. పెదయాదర పంచాయతీ గ్రామ కంఠంలో ఉన్న ఇళ్లను సర్వే చేయించేలా చర్యలు తీసుకోవాలని గ్రామ ప్రజలు కోరగా రెవెన్యూ అధికారులను పంపి తగు చర్యలు తీసుకుంటామని చెప్పారు. గుండుపాలెంకు చెందిన మహిళ మంచినీటి సరఫరాలో కలుషిత నీరు వస్తోందని చెప్పడంతో పరిశీలించి చర్యలు తీసుకోవాలని గ్రామీణ రక్షిత మంచినీటి శాఖ అధికారులను ఆదేశించారు. పలువురు వ్యక్తిగత సమస్యల పరిష్కారం కోరుతూ ఇచ్చిన వినతులపై సానుకూలంగా స్పందిస్తూ పరిష్కార చర్యలు తీసుకుంటామని హామీఇచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని