logo

ఆక్రమణలో రహదారులు.. పట్టని అధికారులు

పెడన పురపాలక సంఘం పరిధిలో పలు రహదార్లు ఆక్రమణలకు గురవుతున్నాయి. ప్రధానంగా కొత్త భవనాలు నిర్మిస్తున్న సమయంలో రోడ్ల సరిహద్దున డ్రెయినేజిలను ఆక్రమించి నిర్మిస్తున్నా పట్టణ ప్రణాళిక శాఖ చర్యలు చేపట్టడంలేదు. అన్ని ప్రాంతాల్లో

Published : 29 Jan 2022 01:39 IST

జగపతి థియేటర్‌ నుంచి బైపాస్‌ వెళ్లే రహదారిలో భవన నిర్మాణ సామగ్రి

పెడన, న్యూస్‌టుడే: పెడన పురపాలక సంఘం పరిధిలో పలు రహదార్లు ఆక్రమణలకు గురవుతున్నాయి. ప్రధానంగా కొత్త భవనాలు నిర్మిస్తున్న సమయంలో రోడ్ల సరిహద్దున డ్రెయినేజిలను ఆక్రమించి నిర్మిస్తున్నా పట్టణ ప్రణాళిక శాఖ చర్యలు చేపట్టడంలేదు. అన్ని ప్రాంతాల్లో ఈ సమస్య రోజురోజుకూ పెరుగుతున్నా చర్యలు కన్పించటంలేదు. పట్టణంలో అధిక శాతం రోడ్లు మూడు మీటర్ల వెడల్పు ఉన్నాయి. ఇందులో ఆక్రమణల కారణంగా ట్రాఫిక్‌కు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కొంతమంది భవన నిర్మాణదారులు రహదార్లను ఆక్రమించి మెటీరియల్‌ను డంప్‌ చేస్తున్నారు. ఫలితంగా ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. స్థానిక బంగ్లాస్కూలు వీధిలో ఒక ఇంటికి ట్రాన్స్‌ఫార్మర్‌ను ఎస్పీడీసీఎల్‌ పెడన సెక్షన్‌ అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. దీనికి అవసరమైన విద్యుత్తు స్తంభాలను సిమెంటు రహదారిని ఆక్రమించి ఏర్పాటుచేయటంతో స్థానికులు శుక్రవారం అభ్యంతరం తెలిపారు. ఆ స్తంభం పక్కనే రెండు ఎర్త్‌ వైర్లను ఉంచడంతో మరింత ప్రమాదకరంగా మారింది. ఈ మార్గంలో మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాల ఉండగా నిత్యం ట్రాఫిక్‌తో పాటు విద్యార్థులు రాకపోకలు సాగిస్తుంటారు. రహదార్లపై బహిరంగంగా ఎర్త్‌ వైర్లను ఏర్పాటు చేయటం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని స్థానికులు అభ్యంతరం వ్యక్తంచేశారు. దీంతో విద్యుత్తు శాఖ అధికారులు పనులను తాత్కాలికంగా నిలిపివేశారు. దీనిపై పెడన సెక్షన్‌ విద్యుత్తు ఏఈ కింజరాపు జయరాం వివరణనిస్తూ.. బంగ్లాస్కూలు రోడ్డులో విద్యుత్తు స్తంభం ఏర్పాటు పనులను తాత్కాలికంగా నిలిపివేయాలని సిబ్బందిని ఆదేశించామన్నారు. శనివారం క్షేత్రస్థాయిలో పరిశీలిస్తామని చెప్పారు. రహదార్లపై మెటీరియల్‌ డంప్‌ చేయటం నిబంధనలకు విరుద్ధమని, కట్టుదిట్టంగా అమలు చేసేందుకు చర్యలు చేపడతామని మున్సిపల్‌ టౌన్‌ ప్లానింగ్‌ అధికారి వి.ఏసుబాబు చెప్పారు.

బంగ్లా స్కూలు రోడ్డులో రహదారిపై ఏర్పాటుచేసిన స్తంభం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని