logo

దేవాలయ సిబ్బందిపై ఆగ్రహం

పుట్రేల గ్రామంలోని శ్రీమారెమ్మ అమ్మవారి దేవాలయ సిబ్బంది తీరుపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళన చేపట్టారు. కొంతకాలం క్రితం అయ్యప్ప మాలధారణ, మాలధారుల పూజా కార్యక్రమాల విషయంలో కొవిడ్‌ నిబంధనల పేరుతో తమను

Published : 29 Jan 2022 01:39 IST

ఆలయం వద్ద ఆందోళన వ్యక్తం చేస్తున్న గ్రామస్థులు

విస్సన్నపేట, న్యూస్‌టుడే: పుట్రేల గ్రామంలోని శ్రీమారెమ్మ అమ్మవారి దేవాలయ సిబ్బంది తీరుపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళన చేపట్టారు. కొంతకాలం క్రితం అయ్యప్ప మాలధారణ, మాలధారుల పూజా కార్యక్రమాల విషయంలో కొవిడ్‌ నిబంధనల పేరుతో తమను దేవాలయంలోకి అనుమతించలేదని వారు తెలిపారు. గుడి ప్రాంగణంలో స్థానికుల వాహనాలు నిలిపి ఉంచే సమయంలోనూ సిబ్బంది అనుచితంగా వ్యవహరిస్తున్నారన్నారు. తాజాగా బయటి వ్యక్తులు ప్రైవేటు కార్యక్రమాలు ఏర్పాటు చేసుకున్నా అడ్డంకులు చెప్పకపోగా, సహకరించారని ఆరోపించారు. దీనిపై గుడి కార్యనిర్వహణాధికారి సి.జయప్రకాష్‌బాబును విచారించగా కొవిడ్‌ నిబంధనల కారణంగా కొన్ని ఆంక్షలు పెట్టిన మాట వాస్తవమేనన్నారు. ఆలయ ప్రాంగణంలో బయటి వ్యక్తులు శుక్రవారం ప్రైవేటు కార్యక్రమాన్ని నిర్వహించే ప్రయత్నం చేయగా, సిబ్బంది నిలువరించారని చెప్పారు. సిబ్బంది అనుచిత ప్రవర్తన విషయంలో తమకు నేరుగా ఫిర్యాదు చేస్తే తగిన చర్యలు తీసుకుంటామన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని