logo

‘పాత జీతాలే ఇవ్వండి’

పీఆర్సీ సాధన సమితి పిలుపుమేరకు శుక్రవారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఉద్యోగులు మచిలీపట్నంలో డీఎంహెచ్‌వో సుహాసినిని కలిసి వినతిపత్రం అందజేశారు. తమకు కొత్త జీతాలు వద్దని, పాత జీతాలే ఇవ్వాలని కోరారు. రాజశేఖర్‌, రమాదేవి, భాస్కర్‌,

Published : 29 Jan 2022 01:39 IST

బందరు: డీఎంహెచ్‌వో సుహాసినికి ఉద్యోగుల వినతి

మచిలీపట్నం (గొడుగుపేట): పీఆర్సీ సాధన సమితి పిలుపుమేరకు శుక్రవారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఉద్యోగులు మచిలీపట్నంలో డీఎంహెచ్‌వో సుహాసినిని కలిసి వినతిపత్రం అందజేశారు. తమకు కొత్త జీతాలు వద్దని, పాత జీతాలే ఇవ్వాలని కోరారు. రాజశేఖర్‌, రమాదేవి, భాస్కర్‌, అంజనరావు, ఖాదర్‌, సూరిబాబు, పాండురంగారావు వినతిపత్రం అందించిన వారిలో ఉన్నారు.

సత్యాలపాడు, పెనుగొలను, ఆర్లపాడు(గంపలగూడెం), న్యూస్‌టుడే: మండలంలోని జడ్పీ ఉన్నత పాఠశాలలకు చెందిన ఉపాధ్యాయులు శుక్రవారం పాత పీఆర్సీ మేరకు వేతన బిల్లులు చేయాలని ప్రధానోపాధ్యాయులకు వినతిపత్రాలు అందజేశారు. పెనుగొలను, సత్యాలపాడు, ఆర్లపాడు, గంపలగూడెం, ఊటుకూరు ఉన్నత పాఠశాలల్లో కొత్త పీఆర్సీ వద్దు, పాత జీతాలే ఇవ్వాలనే నినాదంతో హెచ్‌.ఎంలు చంద్రం, శేషంరాజు, శ్రీలక్ష్మి, జమలయ్యకు వినతిపత్రాలు అందించారు. ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లు సాధించుకునే వరకు ఆందోళన కొనసాగుతుందన్నారు. పీఆర్సీ సాధన సమితి సభ్యుల ఆధ్వర్యంలో మండల పరిషత్‌ ఉపాధ్యాయుల వినతి పత్రాలను ఎంఈవో కార్యాలయంలో అందజేశారు.

ముదినేపల్లి: జనవరి వేతనం పాత పీఆర్సీ ప్రకారం చెల్లించాలని మండలంలోని ఉపాధ్యాయ సంఘాల నాయకులు ఎంఈవో కె.నరేశ్‌కుమార్‌కు వినతిపత్రం అందించారు. పీఆర్సీ పోరాట సాధన సమితి పిలుపు మేరకు స్థానిక ఎమ్మార్సీలో శుక్రవారం ఎంఈవోను ఆయా సంఘాల నాయకులు బేతాళ రాజేంద్రప్రసాద్‌, జి.రమేశ్‌, హరిబాబు, జాన్సనబ్‌బాబు కలిసి విన్నవించారు.

ముదినేపల్లి: ఎంఈవో నరేశ్‌కుమార్‌కు వినతిపత్రం

అందిస్తున్న ఉపాధ్యాయ సంఘాల నేతలు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని