logo

ఇళ్ల స్థలాల భూసేకరణకు రూ.7వేల కోట్లు : మంత్రి ధర్మాన

రాష్ట్రంలో పేదలకు ఇళ్లస్థలాలు ఇవ్వడానికి భూసేకరణకు బడ్జెట్‌లో రూ.5వేల కోట్లు కేటాయిస్తే అంతకుమించి రూ.6-7వేల కోట్లు ఖర్చు పెట్టామని రెవెన్యూశాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు

Updated : 19 May 2022 03:04 IST

ఈనాడు-అమరావతి: రాష్ట్రంలో పేదలకు ఇళ్లస్థలాలు ఇవ్వడానికి భూసేకరణకు బడ్జెట్‌లో రూ.5వేల కోట్లు కేటాయిస్తే అంతకుమించి రూ.6-7వేల కోట్లు ఖర్చు పెట్టామని రెవెన్యూశాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు తెలిపారు. గత ప్రభుత్వహయాంలో పేదల ఇళ్లస్థలాల భూసేకరణకు ఒక ఎకరా భూమి సేకరించలేదని, రూ.కోటి సొమ్ము కూడా కేటాయించలేదని విమర్శించారు. గుంటూరులో బుధవారం జరిగిన జిల్లా సమీక్షా మండలి సమావేశానికి హాజరైన మంత్రి ధర్మానప్రసాదరావు విలేకరులతో మాట్లాడారు. మూడేళ్లుగా కులం, మతం, ప్రాంతం, వర్గం, కండబలం, ధనబలం, అధికార బలం కలిగినవారికి కాకుండా రాజ్యాంగం సూచించిన ప్రకారం అర్హులందరికీ గౌరవప్రదంగా సంక్షేమ పథకాలు అందిస్తున్నామన్నారు. పేదల ఇళ్ల నిర్మాణాలు పెద్దఎత్తున చేపట్టినందున సమస్యలు, అడ్డంకులు ఉన్నాయన్నారు. అధికమొత్తంలో నిధులు అవసరమవుతాయన్నారు. పేదల సంక్షేమం కోసం పని చేస్తున్న ప్రభుత్వంలో పనుల కోసం లబ్ధిదారులు ఒక్క రూపాయి కూడా అధికారులకు చెల్లించాల్సిన పరిస్థితి లేదన్నారు. లక్ష మంది సంక్షేమ పథకాలు అందిస్తే అందులో పదిమందికి అందలేదని చెప్పడం గొప్ప విషయం కాదన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని