logo

ప్రశ్నపత్రాలు ఎలా ఉండాలి?

పదోతరగతి పరీక్షల్లో పాఠ్యాంశాల వారీగా ప్రశ్నపత్రాలు రెండు ఉండాలా ఒకటే సరిపోతుందా అంటూ ప్రభుత్వ పరీక్షల విభాగ డైరెక్టర్‌ డి.దేవానందరెడ్డి ఉపాధ్యాయులను

Published : 19 May 2022 03:14 IST

మూల్యాంకన కేంద్రాన్ని పరిశీలిస్తున్న దేవానందరెడ్డి, పక్కన డీఈవో, డీవైఈవో తదితరులు

మచిలీపట్నం(చిలకలపూడి),న్యూస్‌టుడే: పదోతరగతి పరీక్షల్లో పాఠ్యాంశాల వారీగా ప్రశ్నపత్రాలు రెండు ఉండాలా ఒకటే సరిపోతుందా అంటూ ప్రభుత్వ పరీక్షల విభాగ డైరెక్టర్‌ డి.దేవానందరెడ్డి ఉపాధ్యాయులను ఆరా తీశారు. ఆయన మచిలీపట్నంలోని సెయింట్‌ఫ్రాన్సిస్‌ పాఠశాలలో నిర్వహిస్తున్న మూల్యాంకన కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా పరీక్షల నిర్వహణపై ఉపాధ్యాయుల అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు. గతంలో ప్రతి సబ్జెక్టుకు రెండు ప్రశ్నపత్రాలు ఉండగా ఈసారి సైన్సు మినహా మిగిలిన వాటిని ఒకే దానితో నిర్వహించారు. ఈ విధానం కొనసాగించవచ్చా అని అడగ్గా పలువురు ఉపాధ్యాయులు రెండు ఉంటేనే విద్యార్థులకు ఉపయుక్తంగా ఉంటుందని చెప్పారు. మూల్యాంకన నిర్వహణ పట్ల ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. డీిఈవో తాహెరా సుల్తానా, డీవైఈవో యూవీ సుబ్బారావు, ప్రభుత్వ పరీక్షల జిల్లా అసిస్టెంట్‌ కమిషనర్‌ గూడూరు శ్రీనివాస్‌, డిప్యూటీ క్యాంప్‌ అధికారి లలిత్‌మోహన్‌ తదితరులు పాల్గొన్నారు. వివిధ ఉపాధ్యాయ సంఘాల నాయకులు ఆయన్ని మర్యాదపూర్వకంగా కలిసి సత్కరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని