logo

బాలిక ప్రసవం మోసం చేసిన బాలుడిపై కేసు

17 ఏళ్ల బాలికను అదే వయసు కలిగిన బాలుడు ప్రేమపేరుతో వశపర్చుకుని మోసం చేయడంతో ఆమె ఆడపిల్లకు జన్మనిచ్చిన ఘటన కంకిపాడు మండలంలోని ఓ గ్రామంలో

Published : 20 May 2022 06:05 IST

కంకిపాడు గ్రామీణం, న్యూస్‌టుడే: 17 ఏళ్ల బాలికను అదే వయసు కలిగిన బాలుడు ప్రేమపేరుతో వశపర్చుకుని మోసం చేయడంతో ఆమె ఆడపిల్లకు జన్మనిచ్చిన ఘటన కంకిపాడు మండలంలోని ఓ గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. ఒకే గ్రామానికి చెందిన వారిద్దరూ పదో తరగతి చదువుకున్నారు. బాలిక తల్లి మరణించింది. తండ్రి లారీ డ్రైవర్‌గా పని చేస్తుంటాడు. బాలుడి తల్లిదండ్రులు వ్యవసాయ కూలీలుగా ఉంటున్నారు. వారిళ్లు పక్కపక్కనే ఉండటం, బాలుడు ప్రేమ పేరుతో ఆమెను లోబర్చుకోని మోసం చేయడం బాలిక గర్భం దాల్చడానికి కారణమయ్యింది. ఆమెకు నెలలు నిండటంతో విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లగా అక్కడ ఆడపిల్లకు జన్మనిచ్చింది. బాలిక ఫిర్యాదు మేరకు బాలుడిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని