logo

దళిత యువకుడి చికెన్‌ దుకాణం తొలగింపు

మురుగు కాల్వల్లో పూడిక తీత పేరుతో పట్టణంలో ఓ దళిత యువకుడి చికెన్‌ దుకాణాన్ని పడగొట్టడం గురువారం వివాదానికి దారి తీసింది. యంత్రాలతో దుకాణాన్ని పడగొట్టి ఆ

Published : 20 May 2022 06:05 IST

తోట్లవల్లూరులో ఉద్రిక్తత

తహసీల్దారు కార్యాలయం వద్ద తెదేపా నిరసన

తోట్లవల్లూరు, న్యూస్‌టుడే : మురుగు కాల్వల్లో పూడిక తీత పేరుతో పట్టణంలో ఓ దళిత యువకుడి చికెన్‌ దుకాణాన్ని పడగొట్టడం గురువారం వివాదానికి దారి తీసింది. యంత్రాలతో దుకాణాన్ని పడగొట్టి ఆ కుటుంబ జీవనాన్ని దెబ్బతీశారని బాధితులు, దళితులు నిరసనకు దిగారు. దీంతో ఉద్రిక్తతకు దారి తీసింది. పట్టణంలో తెదేపా పామర్రు నియోజకవర్గ బాధ్యుడు వర్ల కుమార్‌రాజా ఆధ్యర్యంలో బాధిత కుటుంబ సభ్యులు తహసీల్దారు కార్యాలయం వద్ద ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా కుమార్‌ రాజా మాట్లాడుతూ పొట్ట కూటికోసం భార్య పుస్తెలు తాకట్టుపెట్టి రోడ్డు పక్కన చికెన్‌ దుకాణం నిర్వహిస్తున్న దళిత యువకుడైన ఈడ్పుగంటి సుధాకర్‌(చిన్నారి)పై కక్షతో పంచాయతీ, రెవెన్యూ అధికారులు చెప్పాపెట్టకుండా దుకాణం కూలదోశారని ఆరోపించారు. వైకాపా నాయకుల ఒత్తిడితో ఎమ్మార్వో కట్టా వెంకట శివయ్య, 70 మంది పోలీసులు, పంచాయతీ సిబ్బంది, రెవెన్యూ అధికారులు కలిసి రూ.50 వేలతో నిర్మించుకున్న చికెన్‌ దుకాణాన్ని కులదోసి ఆ కుటుంబ జీవనాన్ని దెబ్బతీశారన్నారు. అక్రమంగా నిర్వహిస్తున్న వైకాపా సానుభూతి పరుల దుకాణాల్ని వదిలేసి కనీసం సామగ్రి తీసుకునే సమయం కూడా ఇవ్వకుండా తొలగించడం దారుణమన్నారు. తహసీల్దార్‌ డౌన్‌..డౌన్‌ అంటూ దళితులు, మహిళలు నినాదాలు చేశారు. ధర్నా చేస్తున్న కుమార్‌ రాజా, రాష్ట్ర ఉపాధిహామీ మండలి మాజీ డైరెక్టర్‌ వీరంకి వెంకట గురుమూర్తి, మండల తెలుగు రైతు అధ్యక్షుడు నెక్కలపూడి మురళి చెన్నుపాటి శ్రీధర్‌, వల్లూరు కిరణ్‌ తదితరులతో తహసీల్దార్‌ కట్టా వెంకట శివయ్య చర్చించారు. నా వల్ల పొరపాటు జరిగి ఉంటే దళిత కుటుంబానికి న్యాయం చేస్తానని శివయ్య హామీ ఇచ్చారు. బాధితుడు ఎక్కడైనా ఖాశీ స్థలం చూపిస్తే దుకాణం నిర్మించి ఇస్తానని హామీ ఇవ్వడంతో దళితులు ధర్నా విరమించారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు