logo

తల్లిని హతమార్చిన తనయుడు

నవమాసాలు మోసి.. కని పెంచిన తల్లిని ఏమాత్రం జాలి, దయ లేకుండా కొడుకే విచక్షణారహితంగా దాడి చేసి హతమార్చాడు. మత్తుకు బానిసై సైకోగా మారి కన్న తల్లినే మట్టుబెట్టాడు గుడివాడ పట్టణం వాంబే కాలనీకి చెందిన

Updated : 24 May 2022 03:21 IST

కుటుంబ సభ్యులపై తరచూ దాడులు

గుడివాడ గ్రామీణం, న్యూస్‌టుడే: నవమాసాలు మోసి.. కని పెంచిన తల్లిని ఏమాత్రం జాలి, దయ లేకుండా కొడుకే విచక్షణారహితంగా దాడి చేసి హతమార్చాడు. మత్తుకు బానిసై సైకోగా మారి కన్న తల్లినే మట్టుబెట్టాడు గుడివాడ పట్టణం వాంబే కాలనీకి చెందిన ఓ కొడుకు. వివరాల్లోకి వెళ్తే.. పళ్లెం రాజ్యలక్ష్మి (60)కి కుమార్తె లక్ష్మీతులసీ ప్రభ, కుమారుడు హరీష్‌ కుమార్‌ ఉన్నారు. భర్త చాలా కాలం క్రితం చనిపోగా బిడ్డల్ని కష్టపడి పెంచుతోంది. కుమార్తె ఎమ్మెస్సీ ఫిజిక్స్‌ చదివి ప్రైవేటు కళాశాలలో అధ్యాపకురాలిగా పని చేసింది. హరీష్‌ కుమార్‌ మత్తు పదార్థాలకు బానిసై మతి భ్రమించి తల్లిని, సోదరిని విచక్షణారహితంగా కొడుతూ హింసిస్తూ ఉండేవాడని.. ఈ క్రమంలో అతను దాడికి దిగిన సందర్భాల్లో వారిద్దరూ ఇంటి నుంచి పారిపోయి బస్టాండు, రైల్వే స్టేషన్‌, తదితర ప్రాంతాల్లో తల దాచుకునేవారని స్థానికులు చెబుతున్నారు. ఈ విధంగా నెలలో కొద్ది రోజులు వారికి ప్రత్యక్ష నరకం చూపించేవాడని.. అడ్డుకుందామని ప్రయత్నిద్దామన్నా తమపై ఎక్కడ దాడికి దిగుతాడోనని భయపడి అటువైపు వెళ్లేందుకు ఎప్పుడూ సాహసించలేదని తెలిపారు. ఇటీవల కుమార్తెకు  వివాహం చేసి అత్తారింటికి పంపింది. ఎండ తీవ్రతకు రాజ్యలక్ష్మికి కొద్ది రోజులుగా అనారోగ్యం చేసింది. ఈ నేపథ్యంలో సోమవారం తెల్లవారుజామున హరీష్‌ కుమార్‌ తన తల్లిపై తీవ్రంగా దాడి చేయగా ఆమె మృతి చెందింది. అనంతరం కుమారుడు పరారయ్యాడు. రాజ్యలక్ష్మి తన ఇంట్లో విగత జీవిగా పడి ఉండటాన్ని స్థానికులు మధ్యాహ్నం గుర్తించారు. ఆమెకు తల, ముఖంపై తీవ్ర గాయాలయ్యాయి. రాజ్యలక్ష్మి బావ పళ్లెం మంగయ్య ఫిర్యాదు మేరకు వన్‌టౌన్‌ సీఐ కె.గోవిందరాజు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని