logo

అక్రమ తవ్వకాలను అడ్డుకున్న మాజీ ఎమ్మెల్యే సౌమ్య

ఎన్టీఆర్‌ జిల్లా రాఘవాపురం కొండపై చేపడుతున్న అక్రమ గ్రావెల్‌ తవ్వకాలను సోమవారం రాత్రి మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య తెదేపా నాయకులతో కలిసి అడ్డుకున్నారు. గ్రావెల్‌ తవ్వకాలపై గతంలో అధికారులకు

Updated : 24 May 2022 03:26 IST

రాఘవాపురం కొండవద్ద బైఠాయించిన మాజీ ఎమ్మెల్యే సౌమ్య, తెదేపా నాయకులు

నందిగామ గ్రామీణం, న్యూస్‌టుడే: ఎన్టీఆర్‌ జిల్లా రాఘవాపురం కొండపై చేపడుతున్న అక్రమ గ్రావెల్‌ తవ్వకాలను సోమవారం రాత్రి మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య తెదేపా నాయకులతో కలిసి అడ్డుకున్నారు. గ్రావెల్‌ తవ్వకాలపై గతంలో అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడంలేదని ఆమె మండిపడ్డారు. అక్కడే కూర్చుని ధర్నా చేశారు. అధికారులు వచ్చి తవ్వకాలను నిలిపే వరకూ కదలమని తేల్చిచెప్పారు. తెదేపా నాయకుల రాకతో జేసీబీలతో గ్రావెల్‌ తవ్వకాలను నిలిపి టిప్పర్‌ డ్రైవర్లు అక్కడి నుంచి పారిపోయారు. ఈ సందర్భంగా సౌమ్య మాట్లాడుతూ.. రాఘవాపురం కొండనుంచి గ్రావెల్‌ను అక్రమంగా తవ్వి నిత్యం 700 టిప్పర్లు తరలిస్తున్నారని ఆరోపించారు. గనుల శాఖ, రెవెన్యూశాఖ అధికారులకు గతంలో పలుమార్లు ఫిర్యాదు చేసినా ఇటువైపు కన్నెత్తి చూడటంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెదేపా నాయకులు యండ్రపల్లి    శ్రీనివాసరావు, కొండూరు వెంకట్రావు, వీరంకి వీరాస్వామి, శాఖమూరు స్వర్ణలత, ఎస్‌కే కరీముల్లా, సజ్జా అజయ్‌, వేల్పుల భిక్షాలు, వడ్డెల్లి సాంబశివరావు, లక్ష్మీనారాయణ, గౌస్‌, కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని