logo

కుట్టుకూలి ఎప్పుడిస్తారు?

ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఏకరూప వస్త్రం ఉచితంగా ఇస్తున్న ప్రభుత్వం.. రెండేళ్లవుతున్నా కుట్టుకూలి ఇవ్వడం లేదు. ఉమ్మడి కృష్ణా జిల్లాల్లో విద్యార్థులకు విద్యాకానుక కింద పలు రకాల వస్తువులను ఉచితంగా ఇస్తున్నారు. అందులో ఏకరూప

Updated : 24 May 2022 03:31 IST

రెండేళ్లుగా జమకాని బకాయిలు
విజయవాడ విద్య,  న్యూస్‌టుడే

ఏకరూప దుస్తులతో విద్యార్థినులు

ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఏకరూప వస్త్రం ఉచితంగా ఇస్తున్న ప్రభుత్వం.. రెండేళ్లవుతున్నా కుట్టుకూలి ఇవ్వడం లేదు. ఉమ్మడి కృష్ణా జిల్లాల్లో విద్యార్థులకు విద్యాకానుక కింద పలు రకాల వస్తువులను ఉచితంగా ఇస్తున్నారు. అందులో ఏకరూప దుస్తుల నిమిత్తం ప్రతి విద్యార్థికి సంవత్సరానికి మూడేసి జతల ఏకరూప దుస్తుల కుట్టు కూలిగా ఒక్కో జతకు రూ.40 చొప్పున ఇవ్వాల్సి ఉంటుంది. రెండేళ్ల నుంచి ఈ సొమ్ము ఇవ్వకపోవడంతో వస్త్రాన్ని కుట్టించుకోవడానికి విద్యార్థుల తల్లిదండ్రులు సొంత సొమ్ము చెల్లిస్తున్నారు.

కొత్త ప్రతిపాదనలు
2022-23 సంవత్సరానికి 3,22,799 మంది విద్యార్థులకు మూడు జతలకు ఏకరూప వస్త్రాలు పంపిణీ చేసేందుకు సమగ్ర శిక్షా జిల్లా ప్రాజెక్టు ప్రధాన కార్యాలయం నుంచి ఇప్పటికే ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపారు. ఈ విద్యా సంవత్సరానికి కుట్టు కూలి కింద రూ.3,87,35,880లు విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమచేయాల్సి ఉంది.

ప్రభుత్వానికి  నివేదించాం
ఏకరూప దుస్తుల కుట్టు కూలి బకాయిలు సొమ్మును విద్యార్థుల తల్లుల ఖాతాలకు జమ చేయాలని కోరుతూ ప్రభుత్వానికి నివేదించడం జరిగిందని సమగ్రశిక్షా సీఎంవో వెంకటేశ్వరరావు తెలిపారు. త్వరలోనే ఈ మొత్తాన్ని చెల్లిస్తామని సమగ్రశిక్ష ఉన్నతాధికారులు చెబుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని