logo

5 రోజులు... 34,445 పత్రాలు

మచిలీపట్నంలోని సెయింట్‌ ఫ్రాన్సిస్‌ పాఠశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కేంద్రంలో సోమవారం నుంచి  సార్వత్రిక విద్యాపీఠం ఆధ్వర్యంలోని ఓపెన్‌ ఇంటర్‌

Published : 24 May 2022 03:28 IST

ప్రారంభమైన ఓపెన్‌ ఇంటర్‌ మూల్యాంకనం

జవాబు పత్రాలు దిద్దుతున్న అధ్యాపకులు

మచిలీపట్నం కార్పొరేషన్‌, న్యూస్‌టుడే: మచిలీపట్నంలోని సెయింట్‌ ఫ్రాన్సిస్‌ పాఠశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కేంద్రంలో సోమవారం నుంచి  సార్వత్రిక విద్యాపీఠం ఆధ్వర్యంలోని ఓపెన్‌ ఇంటర్‌ మూల్యాంకనం ప్రారంభమయ్యింది. కేంద్రానికి 34,445 జవాబు పత్రాలు కేటాయించారు. వాటిలో హిందీ 128, ఇంగ్లీషు 7,134, తెలుగు 6,746, గణితం 2,026, ఫిజిక్స్‌ 2,538, కెమిస్ట్రీ 2,943, బయాలజీ 1,021, హిస్టరీ 1,698, పొలిటికల్‌ సైన్స్‌ 3,529, ఎకనామిక్స్‌ 4,458, కామర్స్‌ 2,224 చొప్పున ఉన్నాయి. 230మంది అసిస్టెంట్‌ ఎగ్జామినర్స్‌, 46మంది  చీఫ్‌ ఎగ్జామినర్స్‌, 45 మంది పునఃపరిశీలకులను నియమించారు.సోమవారం ప్రారంభమైన మూల్యాంకన ప్రక్రియ 5 రోజుల్లో పూర్తి చేయాల్సి ఉండగా అంతకు ముందుగానే పూర్తిచేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు ప్రభుత్వ పరీక్షల జిల్లా అసిస్టెంట్‌ కమిషనర్‌ గూడూరు శ్రీనివాస్‌ తెలిపారు. డీఈవో తాహెరా సుల్తానా తదితరులు  పర్యవేక్షించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని