logo

చంద్రబాబుతోనే పోలవరం పూర్తి : దేవినేని

తెదేపా అధికారంలోకి వచ్చి చంద్రబాబునాయుడు మళ్లీ ముఖ్యమంత్రి అయిన తర్వాతే పోలవరం ప్రాజెక్టు ఆయన చేతులమీదుగా పూర్తవుతుందని, ప్రస్తుతం అసమర్థుల పాలనలో అది పూర్తికావడం కల్ల అని మాజీ మంత్రి దేవినేని

Published : 24 May 2022 03:28 IST

మాట్లాడుతున్న దేవినేని, చిత్రంలో వర్ల, కొనకళ్ల

పమిడిముక్కల, న్యూస్‌టుడే: తెదేపా అధికారంలోకి వచ్చి చంద్రబాబునాయుడు మళ్లీ ముఖ్యమంత్రి అయిన తర్వాతే పోలవరం ప్రాజెక్టు ఆయన చేతులమీదుగా పూర్తవుతుందని, ప్రస్తుతం అసమర్థుల పాలనలో అది పూర్తికావడం కల్ల అని మాజీ మంత్రి దేవినేని ఉమామమహేశ్వరరావు అన్నారు. పమిడిముక్కలలో ఆదివారం నిర్వహించిన మహానాడు-2022 సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడుతూ చేతకాని జగన్‌ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు విషయంలో చేతులెత్తేసిందన్నారు. రైతులు కష్టపడి పండించిన ధాన్యంలో బస్తాకు రూ.200 నుంచి రూ.300 ప్రభుత్వం నొక్కేస్తోందన్నారు. ఎన్నో ప్రగల్భాలు పలికిన మంత్రు ఇప్పుడు ఏమయ్యారని ప్రశ్నించారు. జగన్‌ ఇసుక, మద్యం తదితరాలతో రూ.లక్షల కోట్లు సంపాదించి ఇంగ్లాండుకు తరలించారని, దావోస్‌ ప్రయాణం అందుకేనంటూ ఆరోపించారు. ఈనెల 27న గ్రామగ్రామాన ఎన్టీఆర్‌ జయంతి కార్యక్రమాలు నిర్వహించుకొని 28న అందరూ ఒంగోలు మహానాడుకు రావాలన్నారు. పార్టీ అభివృద్ధికి కృషిచేస్తున్న వర్ల కుమారరాజాకు అండగా నిలవాలని దేవినేని కోరారు. మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణరావు మాట్లాడుతూ 16 కేసుల్లో ముద్దాయిగా ఉండి పలుసార్లు జైలుకెళ్లి వచ్చిన వ్యక్తికి ముఖ్యమంత్రి పదవి ఇస్తే పాతవిధానంతోనే అధికారికంగా రాష్ట్రాన్ని దోచుకుంటున్నాడని ఆరోపించారు. సభకు అధ్యక్షత వహించిన పామర్రు నియోజకవర్గ తెదేపా బాధ్యుడు వర్ల కుమారరాజా, మాజీ ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్రప్రసాద్‌, తెదేపా మండల అధ్యక్ష కార్యదర్శులు రాజులపాటి శ్రీనివాసరావు, కొల్లూరి బాబ్జీ ఇతర నాయకులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని