logo

ఉచిత గృహ విద్యుత్తుపై ఆంక్షల ఎత్తివేతకు డిమాండ్‌

ఎస్సీ, ఎస్టీ ఉపప్రణాళిక నిధులతో దళితులకు అమలు చేస్తున్న ఉచిత గృహ విద్యుత్తుపై ఆంక్షలను ఎత్తివేయాలని మాల మహానాడు(పీవీ రావు) కృష్టా, ఎన్టీఆర్‌ ఉమ్మడి జిల్లాల అధ్యక్షుడు గోగులమూడి రాజు డిమాండ్‌ చేశారు.

Published : 24 May 2022 03:28 IST

మాట్లాడుతున్న రాజు, హాజరైన చిట్టిబాబు, రామకృష్ణ తదితరులు

కంకిపాడు, న్యూస్‌టుడే: ఎస్సీ, ఎస్టీ ఉపప్రణాళిక నిధులతో దళితులకు అమలు చేస్తున్న ఉచిత గృహ విద్యుత్తుపై ఆంక్షలను ఎత్తివేయాలని మాల మహానాడు(పీవీ రావు) కృష్టా, ఎన్టీఆర్‌ ఉమ్మడి జిల్లాల అధ్యక్షుడు గోగులమూడి రాజు డిమాండ్‌ చేశారు. సోమవారం రాత్రి స్థానిక కార్యాలయంలో నిర్వహించిన సంఘ జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎస్సీ కాలనీలు, గిరిజన తండాల్లో నివసించే వారికే ఈ పథకాన్ని వర్తింపజేయడం అన్యాయమన్నారు. అర్హులైన ప్రతి ఎస్టీ, ఎస్టీ వర్గాలకు ఉచిత విద్యుత్తు అమలు చేయాలని కోరారు. దళితుల ఓట్లతో గద్దెనెక్కిన ప్రభుత్వం వారి ప్రయోజనాలకే విఘాతం కలిగించేలా వ్యవహరించడం ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని గ్రహించాలని సూచించారు. దళితులపై దాడులు, హత్యలు, అత్యాచారాలు, వేధింపులను ఖండిస్తూ సమావేశం తీర్మానం చేసింది. దీనికి సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వర్రె చిట్టిబాబు, ఆయా నియోజకవర్గాల అధ్యక్షులు పి.రామకృష్ణ (పెనమలూరు), సరిహద్దు ఆంతోని (గన్నవరం), పిడుగు వెంకటేశ్వరరావు (పామర్రు), స్థానిక ప్రతినిధులు మువ్వ సుబ్రహ్మణ్యం, దర్శి శ్రీనివాసగాంధీ, గోవాడ బెర్నాడ్‌షా తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని