logo

చిరుప్రాయంలోనే వరల్డ్‌, ఇండియా బుక్‌లో చోటు

చిరుప్రాయంలోనే ఎంతో కఠినమైన శాస్త్రీయ నామాలను సైతం అనర్గళంగా పలకడమే కాకుండా వరల్డ్‌, ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డులో చోటు దక్కించుకుంది ఆ చిన్నారి. ఆమే గొట్టుముక్కల నితీషవర్మ. ఈ పాప వయస్సు 4 ఏళ్ల 9 నెలలు.

Updated : 26 May 2022 06:49 IST


నితీష వర్మ గొట్టుముక్కల

నెహ్రూచౌక్‌ (గుడివాడ), న్యూస్‌టుడే : చిరుప్రాయంలోనే ఎంతో కఠినమైన శాస్త్రీయ నామాలను సైతం అనర్గళంగా పలకడమే కాకుండా వరల్డ్‌, ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డులో చోటు దక్కించుకుంది ఆ చిన్నారి. ఆమే గొట్టుముక్కల నితీషవర్మ. ఈ పాప వయస్సు 4 ఏళ్ల 9 నెలలు. కృష్ణాజిల్లా గుడివాడ టీచర్సు కాలనీలో నివాసం. చిన్నతనం నుంచి ప్రత్యేక ప్రతిభతో ఉండే నితీషవర్మను గమనించిన తల్లి మధు పాపకు కష్టతరమైన శాస్త్రీయ పదాలను ఉగ్గుపాలతో నేర్పించింది. 30 సెకన్ల వ్యవధిలో 30 జంతువుల శాస్త్రీయ నామాలు స్పష్టంగా పలికి ప్రతిభ చాటడంతో వరల్ట్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డు, ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డులను అతి పిన్న వయసులోనే సాధించింది. ఇంకా పలు రికార్డులను కైవసం చేసుకునేందుకు పాపకి శిక్షణ ఇస్తున్నామని తల్లి మధు ‘న్యూస్‌టుడే’కు తెలిపారు. ఈ సందర్భంగా చిన్నారిని పలువురు అభినందించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని