Updated : 29 Nov 2021 14:52 IST
AP News: అహోబిలంలో లోయలోపడిన ఆర్టీసీ బస్సు
ఆళ్లగడ్డ గ్రామీణం: కర్నూలు జిల్లా ఎగువ అహోబిలం అటవీ ప్రాంతంలో ప్రమాదవశాత్తు ఆర్టీసీ బస్సు లోయలో పడింది. ఈ ఘటనలో 10 మందికి గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎగువ అహోబిలం నుంచి దిగువ అహోబిలానికి వచ్చేందుకు బస్సును తిప్పుతున్న క్రమంలో అది అదుపుతప్పి లోయలో పడింది. క్షతగాత్రులను 108 వాహనంలో ఆళ్లగడ్డ తరలించారు. గాయపడిన వారిలో డ్రైవర్ కమాల్ బాష, మైదుకూరుకు చెందిన ఓబులేశు, ధర్మవరంకు చెందిన వెంకటలక్ష్మమ్మతో పాటు మరికొందరు ఉన్నారు. వీరిలో వెంకటలక్ష్మమ్మకు తీవ్ర గాయాలు కావడంతో మెరుగైన వైద్యం కోసం నంద్యాల తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు, ఆలయ అధికారి నర్సయ్య ఘటనాస్థలికి చేరుకొని పరిశీలించారు.
Advertisement
Tags :