logo
Published : 04/12/2021 04:45 IST

రుచించని ఆసుపత్రి బువ్వ

 బిల్లులు అందక నాణ్యత లేక

 గుత్తేదారులకు రూ.కోట్లల్లో బకాయిలు


సర్వజన ఆసుపత్రిలో భోజనం కోసం రోగుల నిరీక్షణ

ఈనాడు డిజిటల్‌ - కర్నూలు: ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులకు అందించే భోజనం(డైట్‌) రుచి తప్పింది. చాలా చోట్ల హోటళ్ల నుంచి తెప్పించి ఇస్తున్నారు. గుత్తేదారులకు సకాలంలో బిల్లులు చెల్లించకపోవడంతో ఈ పరిస్థితి నెలకొన్నట్లు తెలుస్తోంది.పెరిగిన ధరలకు అమలు చేస్తున్న మెనూకు కేటాయిస్తున్న నిధులకు పొంతన లేదు. సర్వజన వైద్యశాల, నంద్యాల జిల్లా ఆసుపత్రి, ఆదోని ఏరియా ఆసుపత్రి, 18 సీహెచ్‌సీల్లో రోగులకు అందించే భోజనం తీరుపై ‘ఈనాడు’ బృందం పరిశీలన చేయగా పలు అంశాలు వెలుగులోకి వచ్చాయి.

ఒక్కొక్కరికి మూడు పూటలు

●ఆసుపత్రిలో ఇన్‌ పేషెంట్లుగా చేరే రోగులకు అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి భోజనం అందించాల్సి ఉంది. సాధారణ రోగులకు ఒక్కొక్కరికి రూ.36, రెండు గుడ్లతో పౌష్టికాహారం అందిస్తే రూ.56, జననీ సురక్ష కార్యక్రమం (జేఎస్‌ఎస్‌కే) కింద రూ.100 చొప్పున మెనూకు ధర నిర్ణయించారు.

● కర్నూలు సర్వజన వైద్యశాలలో నిత్యం 1100 మంది రోగులకు భోజనాలు అందిస్తున్నారు. ఇక్కడి గుత్తేదారుకు ఈ ఏడాది జనవరి నుంచి బిల్లులు అందాల్సి ఉంది. సుమారు రూ.4 కోట్ల మేర బకాయిలున్నట్లు తెలుస్తోంది. అప్పులు తెచ్చి పెట్టలేక.. మధ్యలో ఒక్కసారిగా ఆగితే ఇప్పటికే ఇచ్చిన అప్పుల ఒత్తిళ్లు పెరుగుతాయని దినదినగండంగా లాక్కొస్తున్నామని గుత్తేదారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పదకొండు నెలలుగా బిల్లులు ఆగిపోవడంతో రోగులకు ఆహారం తయారీ, సరఫరా చేసే సిబ్బందికి రెండు నెలలుగా జీతాలివ్వలేని పరిస్థితి నెలకొన్నట్లు తెలిపారు.

ఆసుపత్రి ఆవరణలోనే వంట చేస్తున్న మహిళ

ఆత్మకూరులో ఆగింది

ఆత్మకూరు, న్యూస్‌టుడే: ఆత్మకూరు ప్రభుత్వాసుపత్రిలో నెలకు 40కి పైగా ప్రసవాలు జరుగుతున్నాయి. జననీ శిశు సురక్షా యోజన కింద బాలింతలకు ఉదయం అల్పాహారంగా పాలు, బ్రెడ్డు అందించాలి. మధ్యాహ్నం పోషక వివలువతో కూడిన భోజనం అందించాలి. ఇక్కడ నాలుగు నెలలుగా ఇవ్వడం లేదు. ‘‘ మాది విశాఖపట్టణం. కొత్తపల్లి మండలం సంగమేశ్వరం క్షేత్రం సమీపంలో కృష్ణా నదిలో చేపల వేటతో జీవనం సాగిస్తున్నాం. గత సోమవారం ప్రసవం జరిగింది. బాలింతలకు భోజనం పెట్టడం లేదు. బయట నుంచే తెచ్చుకొంటున్నామని’’ లక్ష్మి ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘ జేఎస్‌ఎస్‌కే పథకం కింద బాలింతలకు భోజనం అందించేవాళ్లం. ఐదారు నెలల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. నాలుగు నెలలుగా భోజనాలు పెట్టడం లేదని ’’ వైద్యాధికారి వెంకటరమణ పేర్కొన్నారు.

ఆసుపత్రుల్లో రోగులకు అందుతున్న భోజనం తీరుపై పరిశీలన కథనం 9లో

Read latest Kurnool News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని