logo
Published : 04/12/2021 04:45 IST

ఎస్సార్బీసీలో పడి రైతు..

మృతదేహం వద్ద రోదిస్తున్న భార్య సుజాత

సంజామల, న్యూస్‌టుడే: పొలంలో పురుగు మందు పిచికారీ చేసేందుకు వెళ్తున్న రైతు ప్రమాదవశాత్తూ ఎస్సార్బీసీలో పడి మృతి చెందిన సంఘటన శుక్రవారం జరిగింది. పోలీసులు, స్థానికుల వివరాల మేరకు.. పంటకు చీడ పీడలు ఆశించడంతో రామిరెడ్డిపల్లె రైతు కొమ్మిరెడ్డి రమణారెడ్డి, ఆయన భార్య సుజాత ద్విచక్ర వాహనంపై పొలంలో పురుగు మందు పిచికారీ చేసేందుకు బయలుదేరారు. ఎస్సార్బీసీ కాల్వ గట్టుపై వెళ్తుండగా, వీరి వాహనం ఇంజిన్‌ రహదారిపై ఉన్న బండరాయికి తగిలి కాల్వలోకి దూసుకెళ్లింది. సుజాత అప్రమత్తమై కిందకు దూకారు. రైతు వాహనంతోపాటు కాల్వలో పడిపోయారు. తలకు తీవ్రగాయమై అక్కడికక్కడే మృతిచెందాడు. స్థానిక రైతులు రమణారెడ్డి మృత దేహాన్ని కాల్వ నుంచి బయటకు తీశారు. రమణారెడ్డికు కుమారుడు భాస్కర్‌రెడ్డి, కుమార్తె అనూష ఉన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

Read latest Kurnool News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని