logo
Published : 04/12/2021 04:45 IST

కరవు నివారణ నిధి కావాలి

కర్నూలు జలమండలి, న్యూస్‌టుడే: రాయలసీమ కరవు నివారణ పథకం (ఆర్‌డీఎంపీ) అమలుకు సంబంధించి నిధులు విడుదల చేయాలని జలవనరులశాఖ అధికారులు కోరారు. ఎస్‌ఆర్‌బీసీ ఎస్‌ఈ కబీర్‌బాషా, కడప ఎస్‌ఈ మల్లికార్జునరెడ్డితో కూడిన బృంద సభ్యులు శుక్రవారం దిల్లీలో నీతిఆయోగ్‌ సభ్యుడు అవినాష్‌మిశ్రాను కలిశారు. రాయలసీయ జిల్లాల్లో సాగునీటి ప్రాజెక్టులు, నీటివనరులు, కొత్తగా చేపట్టే ఆర్‌డీఎంపీ ప్రాజెక్టు ద్వారా ఆయకట్టు అభివృద్ధి తదితర అంశాలను వివరించారు. ప్రధానమంత్రి కృషి సంచయ్‌ యోజన కింద రూ.28,470 కోట్లు విడుదల చేయాలని అవినాష్‌ మిశ్రాను కోరినట్లు ఎస్‌ఈ కబీర్‌బాషా పేర్కొన్నారు. సమగ్ర నివేదికను కేంద్ర జలసంఘం కమిషన్‌ (సీడబ్యూసీ)కు అందజేయాలని చెప్పారని, ఈ మేరకు నివేదికలు సిద్ధం చేస్తున్నామన్నారు.

Read latest Kurnool News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని