logo
Published : 04 Dec 2021 04:45 IST

కల్తీ విత్తనాలతో మోసం చేశారని ధర్నా


ఆందోళన చేస్తున్న రైతులు

నంద్యాల వ్యవసాయం, న్యూస్‌టుడే: నకిలీ విత్తనాలతో పంటలు నష్టపోయామని, తమకు న్యాయం చేయాలని కోరుతూ రుద్రవరం మండలం పెద్దకంబలూరుకు చెందిన 50మంది రైతులు పట్టణంలోని నూనెపల్లె వద్ద ఉన్న నీలకంఠేశ్వర విత్తన దుకాణం ఎదుట ధర్నా నిర్వహించారు. రైతులు హరినారాయణ రెడ్డి, రామకృష్ణుడు, మధుసూదన్‌, నరసింహ, నారాయణ మాట్లాడుతూ.. ఎకరాకు 40 బస్తాలు పండు తాయని చెప్పడంతో గ్రామంలో 250 ఎకరాల్లో వరి పంట సాగు చేశామన్నారు. 25 కిలోల బస్తాలు 250 కొనుగోలు చేశామని తెలిపారు. డీఎస్పీ, ఏవోకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు. నంద్యాల శాస్త్రవేత్తలు చూసినా, రైతులను అడగలేదన్నారు. ఉదయం నుంచి రైతులు మూడు గంటల వరకు ధర్నా చేశారు. పోలీసులు జోక్యం చేసుకుని సర్ది చెప్పారు. ఆర్డీవో కార్యాలయంలో ఫిర్యాదు చేస్తామని రైతులు తెలిపారు.

Read latest Kurnool News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :
వీక్షకులకు గమనిక
ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఆయా ప్రకటనకర్తల ఉత్పత్తులు/ సేవల గురించి ఈనాడు సంస్థకి ఎటువంటి అవగాహనా ఉండదు. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి, జాగ్రత్తలు తీసుకొని కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు/ సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకీ తావు లేదు.

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని