logo

మల్లన్న దర్శనానికి ఆన్‌లైన్‌లో టికెట్లు

శ్రీశైల మహాక్షేత్రంలో భ్రమరాంబ మల్లికార్జునస్వామివార్ల దర్శనం.. ఆర్జిత సేవలకు సంబంధించిన టికెట్లు ఆన్‌లైన్‌లోనే పొందాల్సి ఉంటుందని ఈవో ఎస్‌.లవన్న స్పష్టం చేశారు. ఇప్పటికే ఆర్జిత సేవా టిక్కెట్ల కరెంట్‌ బుకింగ్‌ను పూర్తిగా నిలిపివేశామని

Published : 20 Jan 2022 03:28 IST

ఫోన్లో భక్తులతో మాట్లాడుతున్న ఈవో లవన్న

శ్రీశైలం ఆలయం, న్యూస్‌టుడే : శ్రీశైల మహాక్షేత్రంలో భ్రమరాంబ మల్లికార్జునస్వామివార్ల దర్శనం.. ఆర్జిత సేవలకు సంబంధించిన టికెట్లు ఆన్‌లైన్‌లోనే పొందాల్సి ఉంటుందని ఈవో ఎస్‌.లవన్న స్పష్టం చేశారు. ఇప్పటికే ఆర్జిత సేవా టిక్కెట్ల కరెంట్‌ బుకింగ్‌ను పూర్తిగా నిలిపివేశామని పేర్కొన్నారు. ఉచిత దర్శనానికీ ఆన్‌లైన్‌ ద్వారా రిజిస్ట్రేషన్‌ చేసుకునే అవకాశం కల్పించామన్నారు. భక్తులు తప్పని సరిగా మాస్కు ధరించడంతో పాటు భౌతికదూరం పాటించాలన్నారు. దేవదాయశాఖ కమిషనర్‌ మార్గదర్శకాల ప్రకారం శ్రీశైలంలో దర్శనాలు, ఆర్జిత సేవలు, కొవిడ్‌ కట్టడి చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు.

కాలిబాట వసతులపై భక్తుల ఆరా

శ్రీశైలం ఆలయం, న్యూస్‌టుడే : శ్రీశైల మహాక్షేత్రంలోని పరిపాలనా భవనంలో బుధవారం డయల్‌ యువర్‌ ఈవో కార్యక్రమం జరిగింది. భక్తులు అడిన పలు అంశాలకు ఈవో ఎస్‌.లవన్న సమాధానం ఇచ్చారు. శ్రీశైలానికి వచ్చే కాలిబాట మార్గంలోని నాగలూటి, పెచ్చెరువు, భీమునికొలను, కైలాస ద్వారం వరకు ఉన్న వసతులు, ఇతరత్రా ఏర్పాట్లను అడిగి అడిగి తెలుసుకొన్నారు. దేవస్థానం వసతి సౌకర్యాలపై హైదరాబాద్‌కు చెందిన భక్తురాలు పలు సూచనలు చేశారని దేవస్థానం అధికారులు ప్రకటనలో తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని