logo

నిర్ధారణకు పరీక్ష

కర్నూలు నగరంలో కొవిడ్‌ ఉద్ధృతి రోజురోజుకు పెరుగుతోంది. సర్వజన వైద్యశాలలో నిర్ధారణ పరీక్షలకు ప్రత్యేక కేంద్రం ఏర్పాటు చేయడంలో అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. నిత్యం 300 నుంచి 350 మంది వరకు ఆసుపత్రికొచ్చి వెనక్కి వెళ్తున్నారు.

Published : 20 Jan 2022 03:28 IST

సర్వజన వైద్యశాలలో కొవిడ్‌ పరీక్షలు చేయని వైనం

సర్వజన వైద్యశాలలో గతంలో కొవిడ్‌ పరీక్షలు చేసే కేంద్రం

కర్నూలు వైద్యాలయం, న్యూస్‌టుడే: కర్నూలు నగరంలో కొవిడ్‌ ఉద్ధృతి రోజురోజుకు పెరుగుతోంది. సర్వజన వైద్యశాలలో నిర్ధారణ పరీక్షలకు ప్రత్యేక కేంద్రం ఏర్పాటు చేయడంలో అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. నిత్యం 300 నుంచి 350 మంది వరకు ఆసుపత్రికొచ్చి వెనక్కి వెళ్తున్నారు. రెండు విడతల్లో సర్వజన వైద్యశాలలో ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ల్యాబ్‌ టెకీ్నిషియన్‌, డేటా ఎంట్రీ ఆపరేటర్లు పనిచేసేవారు. ఈసారి నిర్ధారణ పరీక్షలకు సిబ్బంది నియామకం చేపట్టాలని డీఎంహెచ్‌వోను జేసీ ఆదేశించి నెల రోజులైనా నేటికీ అడుగులు పడలేదు. రెండో అల కొవిడ్‌ ఉద్ధృతిలో సర్వజన వైద్యశాలలో నెలకు 10 వేల నుంచి 12 వేల వరకు కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు చేశారు. ప్రస్తుతం నగరంలో కేసులు పెరుగుతున్నా పట్టణ ఆరోగ్యకేంద్రాల్లో పూర్తి స్థాయిలో పరీక్షలు చేయడం లేదు. ఈవారం రోజుల్లోనే 30 వైద్యులు, 25 నర్సులకు పాజిటివ్‌ నిర్ధారణైంది. వైరస్‌ వ్యాప్తి ఎక్కువగా ఉన్నా నిర్ధారణ పరీక్షలు చేయకపోవడంతో బాధితులు ఆందోళన చెందతున్నారు.

జిల్లావ్యాప్తంగా కేసులు నమోదు 452

కర్నూలు: 344 నంద్యాల: 14

నందికొట్కూరు: 14

గ్రామీణ ప్రాంతాల్లో వెల్దుర్తి: 6, ఓర్వకల్లు:7 నందికొట్కూరు గ్రామీణం: 7

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని