logo

అనిశా అధికారుల తనిఖీ

అవినీతి నిరోధక శాఖ అధికారులు గడివేముల తహసీల్దార్‌ కార్యాలయంలో బుధవారం తనిఖీలు చేశారు. మధ్యాహ్నం కార్యాలయానికి వచ్చిన అధికారులు తలుపులు వేసి దస్త్రాలు పరిశీలించారు. పలువురి పట్టాదారు పాసుపుస్తకాలు స్వాధీనం చేసుకొన్నారు.

Published : 20 Jan 2022 03:28 IST

తహసీల్దార్‌ కార్యాలయంలో విచారణ

సిబ్బందిని విచారిస్తున్న ఏసీబీ డీఎస్పీ శివనారాయణ స్వామి

గడివేముల, న్యూస్‌టుడే: అవినీతి నిరోధక శాఖ అధికారులు గడివేముల తహసీల్దార్‌ కార్యాలయంలో బుధవారం తనిఖీలు చేశారు. మధ్యాహ్నం కార్యాలయానికి వచ్చిన అధికారులు తలుపులు వేసి దస్త్రాలు పరిశీలించారు. పలువురి పట్టాదారు పాసుపుస్తకాలు స్వాధీనం చేసుకొన్నారు. అక్కడికి వచ్చిన రైతులను విచారించారు. భూసమస్యల పరిష్కారానికి బాధితులు నెలల తరబడి తిరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని కొందరు వాపోయారు. రైతుల ఫిర్యాదులపై తహసీల్దారు నాగమణి, ఉపతహసీల్దారు సుభాకర్‌, గ్రామరెవెన్యూ అధికారులను విచారించారు. ఏసీబీ డీఎస్పీ శివనారాయణ విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ.. తహసీల్దార్‌ కార్యాలయంపై ఫిర్యాదులు రావడంతో తనిఖీలు చేశాం.. సిబ్బంది వద్ద అనధికారికంగా ఉన్న రూ.43,980 స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. ముఖ్యమైన దస్త్రాలు స్వాధీనం చేసుకొని పరిశీలించిన అనంతరం ప్రభుత్వానికి నివేదిక ఇస్తామన్నారు. దాడుల్లో సీఐలు కృష్ణారెడ్డి, కృష్ణయ్య, వంశీనాథ్‌, ఇంతియాజ్‌బాషా పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని