logo

శిశు పోషణ్‌ ట్రాకర్‌

స్త్రీ, శిశు సంరక్షణే లక్ష్యంగా ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుంది. పిల్లల్లో పౌష్టికాహార లోపాన్ని నివారించడానికి పోషణ్‌ అభియాన్‌ ద్వారా పిల్లలకు, గర్భిణులకు పౌష్టికాహారం అందజేస్తోంది. చిన్నారుల్లో శారీరక ఎదుగుదల లోపాలపై

Published : 20 Jan 2022 03:28 IST

కేంద్రంలో అక్షర జ్ఞానం పొందుతున్న చిన్నారులు

కోడుమూరు గ్రామీణం, బుధవార పేట, న్యూస్‌టుడే: స్త్రీ, శిశు సంరక్షణే లక్ష్యంగా ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుంది. పిల్లల్లో పౌష్టికాహార లోపాన్ని నివారించడానికి పోషణ్‌ అభియాన్‌ ద్వారా పిల్లలకు, గర్భిణులకు పౌష్టికాహారం అందజేస్తోంది. చిన్నారుల్లో శారీరక ఎదుగుదల లోపాలపై కేంద్ర ప్రభుత్వం మరింత దృష్టి సారించింది. అందుకు ప్రత్యేకంగా ఓ యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీని ద్వారా ఎప్పటికప్పుడు గర్భిణులు, బాలింతలు, చిన్నారుల వివరాలను సేకరించి వారి ఆరోగ్య పరిస్థితిని పోషణ్‌ ట్రాకర్‌లో నమోదు చేసేలా అంగన్‌వాడీ టీచర్లకు సూచించింది. మహిళ గర్భం దాల్చినప్పటి నుంచి శిశువు జన్మించే వరకు మొత్తం ఆరోగ్య సమాచారాన్ని యాప్‌లో నమోదు చేస్తారు. దీంతో చిన్నారులకు పౌష్టికాహారం, మెరుగైన వైద్యసేవలు అందించటం సులువుగా ఉంటుందని అధికారులు తెలుపుతున్నారు. జిల్లాలోని అన్ని అంగన్‌వాడీ సిబ్బందికి యాప్‌పై అవగాహన కల్పిస్తున్నారు.

ప్రోత్సాహక బహుమతులు: జిల్లాలో మొత్తం 3547 అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. అంగన్‌వాడీ కేంద్రాలకు లక్ష్యాలను నిర్ణయించి వారికి ప్రోత్సాహకాలను ఇవ్వనుంది. అందుకు ప్రతినెలా చిన్నారుల బరువు, ఎత్తు, తదితర వివరాలను సేకరించనున్నారు. పోషన్‌ అభియాన్‌ ద్వారా కొత్త లక్ష్యాలు, విధి విధానాలు అమల్లోకి వచ్చేలా కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ ఆదేశాలు జారీ చేసింది. నిర్ణీత లక్ష్యాలను సేకరించి యాప్‌లో నమోదు చేస్తే ప్రొత్సాహకం కింద అంగన్‌వాడీలకు నెలకు రూ.500లు ఇవ్వనుంది.

ప్రతినెల నమోదు: జిల్లాలోని అంగన్‌వాడీ కార్యకర్తలు తమ పరిధిలోని దాదాపు 80శాతం కుటుంబాలను సందర్శించాలి. పుట్టిన బిడ్డ నుంచి 6 ఏళ్లలోపు పిల్లల వివరాలను ఇంటింటికీ వెళ్లి సేకరించి ప్రతి నెల పోషణ్‌ ట్రాక్‌లో నమోదు చేయాలి. పిల్లల బరువు, ఎత్తు, ప్రమాణాలను బట్టి లోపాలను తెలుసుకోవాలి. ట్రాక్‌లో నమోదు చేసినప్పుడే లక్ష్యం సాధించినట్లు.

జిల్లాలో ప్రస్తుతం మూడు లక్షలకు పైగా చిన్నారులు, ముఫ్పై ఐదు వేలకు పైగా గర్భిణులు ఉన్నారు.

0-3 ఏళ్లలోపు 1,76,472, 3-6 ఏళ్లలోపు 1,27,940

గర్భిణులు 35,870, బాలింతలు 30,868

సమస్త వివరాలు నమోదు చేస్తున్నాం

- ప్రవీణ, పీడీ, స్త్రీ, శిశు సంక్షేమశాఖ

ఆరేళ్లలోపు చిన్నారుల సమస్త వివరాలు పోషణ్‌ ట్రాకర్‌లో నమోదు చేసేలా ఐసీడీఎస్‌ సిబ్బంది అంగన్‌వాడీ టీచర్లకు అవగాహన కల్పిస్తారు. గతేడాది నుంచి కేంద్రం వివరాలను అంతర్జ్జాలంలో నమోదు చేస్తుంది. ప్రత్యేకంగా చిన్నారుల వివరాలను నమోదు చేసేలా చూస్తాం. యాప్‌లో లక్ష్యాలను చేరితే అంగన్‌ వాడీ కార్యకర్తలకు ప్రొత్సాహకాలు అందుతాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని