logo

దోపిడీ పాలనకుచరమగీతం పాడుదాం

పోలీసు వ్యవస్థను గుప్పిట్లో ఉంచుకుని అరాచకాలు, దోపిడీలతో ఆస్తులు కూడబెట్టుకోవడమే లక్ష్యంగా సాగుతున్న వైకాపా పాలనకు చరమగీతం పాడుదామని తెదేపా జాతీయ ఉపాధ్యక్షుడు, కేంద్ర మాజీ మంత్రి కోట్ల జయసూర్యప్రకాశ్‌రెడ్డి అన్నారు.

Published : 20 Jan 2022 03:28 IST

మాట్లాడుతున్న తెదేపా జాతీయ ఉపాధ్యక్షుడు కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి

పత్తికొండ పట్టణం, న్యూస్‌టుడే: పోలీసు వ్యవస్థను గుప్పిట్లో ఉంచుకుని అరాచకాలు, దోపిడీలతో ఆస్తులు కూడబెట్టుకోవడమే లక్ష్యంగా సాగుతున్న వైకాపా పాలనకు చరమగీతం పాడుదామని తెదేపా జాతీయ ఉపాధ్యక్షుడు, కేంద్ర మాజీ మంత్రి కోట్ల జయసూర్యప్రకాశ్‌రెడ్డి అన్నారు. బుధవారం ఆయన పత్తికొండలో మార్కెట్‌ యార్డు మాజీ ఛైర్మన్‌, తెదేపా నాయకుడు ప్రమోద్‌కుమార్‌ రెడ్డి గృహంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. జగన్‌ సారధ్యంలోని వైకాపా ప్రభుత్వం ఆర్థికంగా దెబ్బతిందని, ఇక తిరిగి అధికారంలోకి రాదన్న సత్యాన్ని గ్రహించి అరాచకాలు, దోపిడీలతో మంత్రులు ఆస్తులు కూడబెట్టుకోవడంపై దృష్టి సారించారన్నారు. గుడివాడలో చోటుచేసుకున్న ఘటనను ఉదాహరిస్తూ రికార్డింగ్‌ డ్యాన్సుల పేరిట సొమ్ము చేసుకోవాలనుకున్నవారిపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం ఏమిటన్నారు. తెదేపా వారిపై అక్రమ కేసులు బనాయించే పోలీసులు ఈ ఘటనపై నోరు మెదపరెందుకన్నారు. హంద్రీనీవా నుంచి 85 వేల ఎకరాలకు నీరందించడంలో ప్రభుత్వ వైఫల్యంతో రైతుల పరిస్థితి దయనీయంగా మారిందన్నారు. ఈ సమావేశంలో తెదేపా నియోజకవర్గ బాధ్యుడు కేఈ శ్యాంబాబు, జిల్లా ఉపాధ్యక్షుడు సాంబశివారెడ్డి, తిమ్మయ్య చౌదరి, భాస్కరరెడ్డి ప్రభాకర్‌రెడ్డి పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని