logo

సృజన్‌ సింగ్‌ కుటుంబానికి అండగా ఉంటాం

ఇటీవల మత విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా పోస్టులు చేసిన నంద్యాలకు చెందిన సృజన్‌ సింగ్‌ను పోలీసులు అరెస్టు చేసిన విషయం విదితమే. రాయలసీమ పర్యటనలో భాగంగా బుధవారం రాత్రి భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు సృజన్‌సింగ్‌

Published : 20 Jan 2022 03:28 IST

భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు

కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్న భాజపా నాయకులు

నంద్యాల పాతపట్టణం, న్యూస్‌టుడే: ఇటీవల మత విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా పోస్టులు చేసిన నంద్యాలకు చెందిన సృజన్‌ సింగ్‌ను పోలీసులు అరెస్టు చేసిన విషయం విదితమే. రాయలసీమ పర్యటనలో భాగంగా బుధవారం రాత్రి భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు సృజన్‌సింగ్‌ కుటుంబీకులను పరామర్శించారు. ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, భాజపా అండగా ఉంటుందని కుటుంబానికి భరోసా కల్పించారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం ఆత్మకూరులో జరిగిన ఘటనపై నిష్పక్షపాతంగా వ్యవహరించాలన్నారు. పోలీసు, రెవెన్యూ వ్యవస్థలు గాడి తప్పితే ప్రజాస్వామ్యానికి విఘాతం కలుగుతుందన్నారు. హిందూ మనోభావాలను గౌరవించే విధంగా ప్రభుత్వం, పోలీసులు చర్యలు తీసుకోవాలని కోరారు. భాజపా రాష్ట్ర నాయకులు తూముశివారెడ్డి, పట్టణాధ్యక్షుడు బ్రహ్మం తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని