logo

68 చెరువులకు హంద్రీనీవా నీరు ట్రయల్‌ రన్‌ ప్రారంభం

మండలంలోని ఆలంకొండ గ్రామ సమీపంలో హంద్రీనీవా ప్రధాన కాల్వపై 68 చెరువులు నింపడానికి నిర్మించిన పంప్‌హౌజ్‌ ద్వారా నీటిని ట్రయల్‌ రన్‌ నిర్వహించినట్లు ఎస్‌ఈ రెడ్డి శేఖర్‌రెడ్డి తెలిపారు. బుధవారం ఆయన ఈఈ శ్రీనివాసులు, డీఈ విజయరాజుతో

Published : 20 Jan 2022 03:28 IST

పులిచెర్ల సమీపంలో కొండపై నీటిని పరిశీలిస్తున్న ఎస్‌ఈ రెడ్డి శేఖరరెడ్డి

కృష్ణగిరి, న్యూస్‌టుడే: మండలంలోని ఆలంకొండ గ్రామ సమీపంలో హంద్రీనీవా ప్రధాన కాల్వపై 68 చెరువులు నింపడానికి నిర్మించిన పంప్‌హౌజ్‌ ద్వారా నీటిని ట్రయల్‌ రన్‌ నిర్వహించినట్లు ఎస్‌ఈ రెడ్డి శేఖర్‌రెడ్డి తెలిపారు. బుధవారం ఆయన ఈఈ శ్రీనివాసులు, డీఈ విజయరాజుతో కలిసి ట్రయల్‌ రన్‌ను ప్రారంభించారు. హంద్రీనీవా కాల్వ నుంచి మోటార్ల ద్వారా పులిచెర్ల గ్రామ సమీపంలో కొండపై నిర్మించిన ట్యాంకుకు నీటిని తరలించి, అక్కడి నుంచి 1వ ఛానల్‌ ద్వారా వెంకటాపురం, కటారుకొండ చెరువులకు నీటిని మళ్లించినట్లు ఆయన తెలిపారు. ఇది విజయవంతమైతే పులిచెర్ల కొండపై ఉన్న 2, 3 ఛానళ్ల ద్వారా నీటిని ట్రయల్‌ రన్‌ నిర్వహించనున్నట్లు డీఈ విజయరాజు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాణ్యతా నియంత్రణ డీఈ నాయక్‌, కోయా కంపెనీ పర్యవేక్షకులు జంషీర్‌, ఇంజినీర్‌ జవహర్‌ పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని