logo

అంతర్రాష్ట్ర కబడ్డీ విజేత ఎమ్మిగనూరు

క్రీడల్లో గెలుపోటములు సమానంగా తీసుకోవాలని పురపాలక ఛైర్మన్‌ డాక్టర్‌ రఘు, వైకాపా నేత జగన్‌మోహన్‌ రెడ్డి అన్నారు. ఎమ్మిగనూరు జాతర సందర్భంగా నిర్వహిస్తోన్న అంతర్రాష్ట్ర కబడ్డీ పోటీలు శనివారం ముగిశాయి. ఫైనల్‌ నువ్వానేనా అన్నట్లు సాగింది. జూనియర్‌ కళాశాలలో జరుగుతో

Published : 23 Jan 2022 02:16 IST

ఎమ్మిగనూరు జట్టుకు బహుమతి ప్రదానం చేస్తున్న డా.రఘు, జగన్‌మోహన్‌రెడ్డ

ఎమ్మిగనూరు, న్యూస్‌టుడే: క్రీడల్లో గెలుపోటములు సమానంగా తీసుకోవాలని పురపాలక ఛైర్మన్‌ డాక్టర్‌ రఘు, వైకాపా నేత జగన్‌మోహన్‌ రెడ్డి అన్నారు. ఎమ్మిగనూరు జాతర సందర్భంగా నిర్వహిస్తోన్న అంతర్రాష్ట్ర కబడ్డీ పోటీలు శనివారం ముగిశాయి. ఫైనల్‌ నువ్వానేనా అన్నట్లు సాగింది. జూనియర్‌ కళాశాలలో జరుగుతోన్న వాలీబాల్‌ పోటీలు ముగిశాయి. బహుమతుల ప్రదానోత్సవంలో డా.రఘు మాట్లాడుతూ క్రీడలకు నీలకంఠేశ్వర స్వామి జాతర ఎంతో ప్రత్యేకమని తెలిపారు. క్రీడాకారులు ఓటమితో కుంగిపోరాదన్నారు. ఎంపీపీ కేశన్న, వైకాపా కన్వీనర్‌ జగన్‌మోహన్‌రెడ్డి, పురపాలక ఉపాధ్యక్షుడు నజీఆర్‌ అహ్మద్‌, టౌన్‌బ్యాంకు అధ్యక్షుడు రాజశేఖర్‌, మున్సిపల్‌ మాజీ ఛైర్మన్‌ బుట్టా రంగయ్య, కౌన్సిలర్లు శివప్రసాద్‌, రియాజ్‌, రంగన్న, ఖాజా తదితరులు పాల్గొన్నారు. కబడ్డీలో యూనివర్సల్‌ ఎమ్మిగనూరు జట్టు ప్రథమ స్థానంలో నిలవగా బెంగళూరు జట్టు ద్వితీయ స్థానంలో నిలిచింది. వాలీబాల్‌లో మంగళూరు జట్టు విజేతగా నిలవగా కర్ణాటకలోని చత్నంపల్లి జట్లు ద్వితీయ స్థానం సాధించింది.

కడప ఎద్దులకు ప్రథమస్థానం

ఎమ్మిగనూరు వ్యవసాయం, న్యూస్‌టుడే: నీలకంఠేశ్వరస్వామి జాతర సందర్భంగా నిర్వహించిన ఒంగోలు ఎద్దుల బండలాగుడు పోటీల్లో సీనియర్‌ విభాగంలో కడప జిల్లా చౌటుపల్లికి చెందిన మార్తల చండ్రఓబుల్‌రెడ్డి వృషభాలు ప్రథమ స్థానంలో నిలిచాయి. రూ.లక్ష నగదు బహుమతిని వైకాపా నియోజకవర్గ నాయకుడు జగన్‌మోహన్‌రెడ్డి, బసిరెడ్డి ప్రదానం చేశారు. కడప జిల్లా చౌటుపల్లికి చెందిన మార్తల చండ్ర ఓబుల్‌రెడ్డి, పెద్దశివకాంతరెడ్డి అదే జిల్లా కామనూరు ఎద్దులు ద్వితీయ బహుమతి రూ.75వేలు గెలిచాయి. ఐదో స్థానం వరకు నిర్వాహకులు బహుమతులు అందజేశారు. సబ్‌ జూనియర్‌ విభాగంలో గుంటూరు జిల్లా వేటపాలెం ఆర్‌కే బుల్స్‌ రూ.50వేలు, రంగారెడ్డి జిల్లా నాదర్‌గుల్‌ వైపీఆర్‌ బుల్స్‌ రూ.35వేలు గెలుచుకున్నాయి. మూడో స్థానంలో కర్నూలు జిల్లా చిన్నకాణాలకు చెందిన గుండం చెన్నారెడ్డి, తిరుపాల్‌రెడ్డి ఎద్దులు నిలిచి రూ.25వేలు పొందాయి. కార్యక్రమానికి వ్యాఖ్యాతలుగా వాడాల రామానాయుడు, అబ్దుల్‌కలాం వ్యవహరించారు. న్యాయనిర్ణేతగా గుడేకల్‌ లక్ష్మన్న, నాయకులు బసిరెడ్డి, భీమిరెడ్డి, షబ్బీర్‌ పాల్గొన్నారు.

ప్రథమ స్థానంలో నిలిచిన వృషభాలు, ఇందులో అఖండలో నటించిన వృషభం ఉంది

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు