logo

ఈ నెల 24న స్పందనడయల్‌ యువర్‌ కలెక్టర్‌

కొవిడ్‌ విస్తరిస్తున్న నేపథ్యంలో ఈనెల 24 నుంచి స్పందన-డయల్‌ యువర్‌ కలెక్టర్‌ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కలెక్టర్‌ పి.కోటేశ్వరరావు ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజా ఫిర్యాదులను స్వయంగా తీసుకొనే కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేసి

Published : 23 Jan 2022 02:16 IST

కర్నూలు సచివాలయం, న్యూస్‌టుడే: కొవిడ్‌ విస్తరిస్తున్న నేపథ్యంలో ఈనెల 24 నుంచి స్పందన-డయల్‌ యువర్‌ కలెక్టర్‌ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కలెక్టర్‌ పి.కోటేశ్వరరావు ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజా ఫిర్యాదులను స్వయంగా తీసుకొనే కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేసి ఆ స్థానంలో సోమవారం (24వ తేదీ) ఉదయం 10.30 నుంచి 12 గంటల వరకు కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో స్పందన-డయల్‌ యువర్‌ కలెక్టర్‌ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. అర్జీదారులు తమ సమస్యలను 08518-277100 ఫోన్‌ ద్వారా మాత్రమే విన్నవించుకోవాలన్నారు. ఎవరూ కలెక్టరేట్‌కు రావవొద్ధు. సమస్యలుంటే ఫోన్‌ ద్వారానే తమ దృష్టికి తీసుకురావాలని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని