logo

వెళ్లేటప్పుడు హుషారు.. తిరిగొచ్చేటప్పుడు ఉసూరు

కౌతాళం మండలంలోని లింగాలదిన్నె, అగసలదిన్నె గ్రామానికి చెందిన 60 మంది విద్యార్థులు ఉన్నత పాఠశాలకు చేరుకునేందుకు నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉండే బాపురం గ్రామానికి వెళ్తారు. వెళ్లేటపుపడు హుషారుగా వెళ్తున్న చిన్నారులంతా సాయంత్రం తిరి

Published : 23 Jan 2022 02:16 IST


సాయంత్రం బాపురం నుంచి అగసలదిన్నె గ్రామానికి నడుచుకుంటూ వెళ్తున్న విద్యార్థులు

కౌతాళం మండలంలోని లింగాలదిన్నె, అగసలదిన్నె గ్రామానికి చెందిన 60 మంది విద్యార్థులు ఉన్నత పాఠశాలకు చేరుకునేందుకు నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉండే బాపురం గ్రామానికి వెళ్తారు. వెళ్లేటపుపడు హుషారుగా వెళ్తున్న చిన్నారులంతా సాయంత్రం తిరిగి వచ్చేటప్పుడు ఉసూరుమంటున్నారు. ఆయా గ్రామాలకు బస్సులేని పరిస్థితి గురించి గతంలో ఈనాడులో ప్రచురితమైన కథనానికి ఆర్టీసీ అధికారులు స్పందించి ఉదయం పూట బస్సును ఏర్పాటు చేశారు. అయితే సాయంత్రం తిరిగి వచ్చేందుకు మాత్రం బస్సు వేయలేదు. దీంతో విద్యార్థులు సాయంత్రాలు తీవ్ర ఇబ్బందులు పడుతూ కాలినడకన ఇళ్లు చేరుకుంటున్నారు. స్కూల్లో ఆలస్యమైనప్పుడు చీకటి పడుతోందని, అటువంటప్పుడు ఊళ్లకు వెళ్లడం ప్రమాదకరంగా మారిందని వారు వాపోతున్నారు.- న్యూస్‌టుడే, కౌతాళం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు