logo

సర్కారు బడులకు ప్రత్యేక నిధి

జిల్లాలో 2,825 ప్రభుత్వ బడులకు నిర్వహణ ఖర్చుల కింద రూ.10.96 కోట్లతో ప్రత్యేక నిధి ఏర్పాటు చేసినట్లు ఏపీ సమగ్ర శిక్ష అదనపు ప్రాజెక్టు సమన్వయకర్త వేణుగోపాల్‌ శనివారం పేర్కొన్నారు. ‘నిధులు రాక.. నిబంధనలు పాటించలేక’ శీర్షికన ‘ఈ

Published : 23 Jan 2022 02:17 IST

కర్నూలు (నగరపాలక సంస్థ), న్యూస్‌టుడే : జిల్లాలో 2,825 ప్రభుత్వ బడులకు నిర్వహణ ఖర్చుల కింద రూ.10.96 కోట్లతో ప్రత్యేక నిధి ఏర్పాటు చేసినట్లు ఏపీ సమగ్ర శిక్ష అదనపు ప్రాజెక్టు సమన్వయకర్త వేణుగోపాల్‌ శనివారం పేర్కొన్నారు. ‘నిధులు రాక.. నిబంధనలు పాటించలేక’ శీర్షికన ‘ఈనాడు’లో 22న ప్రచురితమైన కథనానికి ఆయన స్పందించారు. 2021-22 ఏడాదికి 2,517 పాఠశాలల పీడీ బ్యాంకు ఖాతాకు రూ.9.58 కోట్లు, 308 నాన్‌ పీడీ బ్యాంకు ఖాతాలకు రూ.1.30 కోట్లు కేటాయించినట్లు చెప్పారు. ఈ నిధుల వినియోగం గురించి ఆయా ప్రధానోపాధ్యాయులకు సూచనలు ఇచ్చామన్నారు. జిల్లాలో ఉన్న మండల వనరుల కేంద్రాల నిర్వహణకు రూ.41.25 లక్షలు, క్లస్టర్‌ రిసోర్స్‌ సెంటర్లు.. ఒక్కోదానికి రూ.22 వేల చొప్పున జిల్లా మొత్తంలో ఉన్న 293 వాటికి రూ.64.46 లక్షలు, స్కూల్‌ సేఫ్టీ గ్రాంట్‌ కింద 2,825 బడులు.. ఒక్కోదానికి రూ.2 వేల చొప్పున మొత్తం రూ.56.50 లక్షలు కేటాయించామన్నారు. 15 ఏళ్ల నుంచి 18 ఏళ్ల వయస్సు ఉన్న విద్యార్థులకు కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ పూర్తి చేశామన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు