logo

ఘనంగా లోకేశ్‌ జన్మదిన వేడుకలు

ఆస్పరిలో తెదేపా యువ నేత నారా లోకేశ్‌ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించినట్లు టీఎన్‌ఎస్‌ఎఫ్‌ జిల్లా ఉపాధ్యక్షుడు సతీశ్‌ కుమార్‌, తెలుగు యువత మండలాధ్యక్షుడు

Updated : 23 Jan 2022 19:15 IST

ఆస్పరి: ఆస్పరిలో తెదేపా యువ నేత నారా లోకేశ్‌ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించినట్లు టీఎన్‌ఎస్‌ఎఫ్‌ జిల్లా ఉపాధ్యక్షుడు సతీశ్‌ కుమార్‌, తెలుగు యువత మండలాధ్యక్షుడు రాఘవేంద్ర యాదవ్‌ తెలిపారు. ఆదివారం స్థానిక గాంధీ పార్కులో తెదేపా సీనియర్‌ నాయకులు ఎస్‌.తిమ్మన్న, మాజీ ఎంపీటీసీ సభ్యులు మల్లికార్జున, రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో కేక్‌ కోసి సంబరాలు చేసుకున్నారు. అనంతరం స్థానిక ఆసుపత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు. తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ మున్ముందు మరిన్ని పదవులను అలంకరించడంతో పాటు కార్యకర్తలకు అండగా నిలుస్తారని వారు అన్నారు. కార్యక్రమంలో నాయకులు ఉచ్చిరప్ప, చంద్రశేఖర్‌ చౌదరి, రవి, ఈశ్వర్‌, నాగేంద్ర, రంగస్వామి, హనుమంత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని