logo

కోతల పీఆర్సీ వద్దు

ఉద్యోగుల హక్కుల సాధన కోసం ఎన్ని పోరాటాలు చేయడానికైనా సిద్ధంగా ఉన్నామని రాయలసీమ పశ్చిమ జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కత్తినరసింహారెడ్డి అన్నారు. ‘కొత్త పీఆర్సీ.. కోతల పీఆర్సీ వద్దంటూ’ పీఆర్సీ సాధన సమితి ఇచ్చిన పిలుపుతో బుధవారం పలు కూడళ్ల నుంచి ఉపాధ్యాయులు, ఉద్యోగులు

Published : 27 Jan 2022 05:22 IST

ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి


అంబేడ్కర్‌ విగ్రహానికి వినతిపత్రం అందిస్తున్న ఉద్యోగ, ఉపాధ్యాయ, ఏపీ ఐకాస ఉద్యోగులు, ఎమ్మెల్సీ కత్తి నర్సింహారెడ్డి తదితరులు

కర్నూలు బి.క్యాంపు, న్యూస్‌టుడే: ఉద్యోగుల హక్కుల సాధన కోసం ఎన్ని పోరాటాలు చేయడానికైనా సిద్ధంగా ఉన్నామని రాయలసీమ పశ్చిమ జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కత్తినరసింహారెడ్డి అన్నారు. ‘కొత్త పీఆర్సీ.. కోతల పీఆర్సీ వద్దంటూ’ పీఆర్సీ సాధన సమితి ఇచ్చిన పిలుపుతో బుధవారం పలు కూడళ్ల నుంచి ఉపాధ్యాయులు, ఉద్యోగులు ర్యాలీగా వచ్చి కర్నూలులోని పాతబస్టాండ్‌లోని అంబేడ్కర్‌ విగ్రహానికి వినతిపత్రాలు సమర్పించారు. ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి మాట్లాడుతూ కొత్త పీఆర్సీతో ఉద్యోగులకు తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. ఉద్యోగుల పదవీవిరమణ వయస్సు రెండేళ్ల పాటు పెంచడంతో నిరుద్యోగులు పెరుగుతారని ఆందోళన వ్యక్తం చేశారు. ఉద్యోగులు కోరుకునే విధంగా రాష్ట్ర ఖజానా మెరుగుపడే వరకు పాత పీఆర్సీని అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రభుత్వం పంతానికి పోకుండా ఉద్యోగ సంఘాల నేతలతో చర్చలు జరిపి సమస్య పరిష్కారానికి కృషి చేయాలన్నారు. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి సీపీఎస్‌ రద్దు చేస్తామని ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలన్నారు. విశ్రాంత ఉద్యోగులకు పాత పీఆర్సీ ప్రకారం రావాల్సిన బకాయిలు చెల్లించాలన్నారు. కార్యక్రమంలో ఐకాస ఛైర్మన్‌ వెంగళ్‌రెడ్డి, అమరావతి ఐకాస ఛైర్మన్‌ గిరికుమార్‌రెడ్డి, ప్రభుత్వ సంఘం ఐకాస ఛైర్మన్‌ నరసింహులు, ప్రభుత్వ ఉద్యోగుల ఫెడరేషన్‌ ఛైర్మన్‌ రఘుబాబు, పీఆర్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కరుణనిధిమూర్తి, ఆప్టా ప్రధాన కార్యదర్శి ప్రకాశ్‌రావు, ఏపీటీఎఫ్‌(1938) సంఘం నాయకులు మరియానందం, యూటీఎఫ్‌ రాష్ట్ర నాయకులు సురేష్‌, ఎస్టీయూ నాయకుడు గోకారి, రాష్ట్ర మున్సిపల్‌ వ్యాయామ అధ్యాపక సంఘం అధ్యక్షుడు దాసరి సుధీర్‌, విశ్రాంత వ్యాయామ అధ్యాపక సంఘం నాయకులు కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

నేటి నుంచి రిలే దీక్షలు

కర్నూలు(నగరపాలక సంస్థ), న్యూస్‌టుడే: ఈనెల 27వ తేదీ నుంచి 30వ తేదీ వరకు పీఆర్‌సీ సాధన సమితి ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు ఎస్‌టీయూ జిల్లా అధ్యక్షుడు గోకారి తెలిపారు. నగరంలోని ఎస్‌టీయూ భవనంలో రాష్ట్ర సహాధ్యక్షుడు తిమ్మన్న ఆధ్వర్యంలో బుధవారం సమావేశం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి పాల్గొని వారికి దిశానిర్దేశం చేశారు.


నగరంలోఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో ద్విచక్రవాహన ర్యాలీ

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని