logo

డీఎస్పీ నంటూ డబ్బు డిమాండ్‌

చదివింది మూడో తరగతి.. చేసేది కూలీ పని. అయితే నేం మోసాల్లో ఆరితేరిపోయాడు. డీఎస్పీనని చెప్పుకుంటూ డబ్బులు డిమాండ్‌ చేసిన నిందితుడిని మాధవరం పోలీసులు పట్టుకున్నారు. ఆ వివరాలను మంత్రాలయం సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ భాస్కర్‌, ఎస్సై వేణుగోపాల్‌రాజు బుధవారం మాధవరం పోలీసు

Published : 27 Jan 2022 05:22 IST

 

మంత్రాలయం, న్యూస్‌టుడే: చదివింది మూడో తరగతి.. చేసేది కూలీ పని. అయితే నేం మోసాల్లో ఆరితేరిపోయాడు. డీఎస్పీనని చెప్పుకుంటూ డబ్బులు డిమాండ్‌ చేసిన నిందితుడిని మాధవరం పోలీసులు పట్టుకున్నారు. ఆ వివరాలను మంత్రాలయం సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ భాస్కర్‌, ఎస్సై వేణుగోపాల్‌రాజు బుధవారం మాధవరం పోలీసు స్టేషన్‌లో వెల్లడించారు. నెల్లూరు జిల్లా అనంత సాగరమ మండలం మంగుపల్లికి చెందిన మెరిగ వెంకటేశ్వర్లు మూడో తరగతి చదువుకున్నాడు. కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. నెల్లూరులో ఇతనిపై పలు కేసులు ఉన్నాయి. మంత్రాలయం మండలం రచ్చుమర్రికి చెందిన డి.పెద్ద ఆనంద్‌ చరవాణికి కాల్‌ చేసి.. నేను డీఎస్పీ మాట్లాడుతున్నా నీపై మాధవరం పోలీసుస్టేషన్‌లో ఈ నెల 22న కేసు నమోదైంది. ఆ కేసును కోర్టులో ఉన్న న్యాయమూర్తితో మాట్లాడి కొట్టేయిస్తా. అందుకు ఫోన్‌పే ద్వారా రూ.5 వేలు చెల్లించాలని డిమాండ్‌ చేశాడు. అనుమానించిన బాధితుడు విషయాన్ని మాధవరం ఎస్సై హుస్సేన్‌పీరా దృష్టికి తెచ్చారు. ఎస్సై జిల్లా ఎస్పీ సీహెచ్‌.సుధీర్‌కుమార్‌, ఆదోని డీఎస్పీ వినోద్‌కుమార్‌ దృష్టికి తీసుకెళ్లారు. వారి ఆదేశాల మేరకు రెండు బృందాలుగా ఏర్పడి మంగళవారం తుంగభద్ర రైల్వేస్టేషన్‌లో అరెస్టు చేసినట్లు తెలిపారు. ఇంటర్‌నెట్‌లో నిందితుడి సమాచారం తెలుసుకొని బెదిరింపులకు పాల్పడినట్లు పోలీసులు పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని