logo

జిల్లా సరిహద్దులోవైద్యానికేదీ దిక్కు

కర్ణాటక సరిహద్దు హాలహర్వి మండల కేంద్రంలోని 24 గంటల వైద్యశాలలో వైద్యం అందించేవారు కరవయ్యారు. బుధవారం కర్ణాటక సరిహద్దు గ్రామమైన గోనేహల్‌ గ్రామంలో దేవర జరగ్గా ఆదోనికి చెందిన నరసప్ప హాజరై తిరిగి వస్తుండగా దిగువ కాల్వ వద్ద ద్విచక్ర వాహనదారు ఢీకొని వెళ్లిపోయారు. కాలికి తీవ్ర గాయం

Published : 27 Jan 2022 05:22 IST


చికిత్స అందించేవారు లేక కర్ణాటక రాష్ట్ర 108 వాహనంలోనే ఉన్న నరసప్ప

కర్ణాటక సరిహద్దు హాలహర్వి మండల కేంద్రంలోని 24 గంటల వైద్యశాలలో వైద్యం అందించేవారు కరవయ్యారు. బుధవారం కర్ణాటక సరిహద్దు గ్రామమైన గోనేహల్‌ గ్రామంలో దేవర జరగ్గా ఆదోనికి చెందిన నరసప్ప హాజరై తిరిగి వస్తుండగా దిగువ కాల్వ వద్ద ద్విచక్ర వాహనదారు ఢీకొని వెళ్లిపోయారు. కాలికి తీవ్ర గాయం కావడంతో కర్ణాటక 108లో హాలహర్వి వైద్యశాలకు తరలించగా అక్కడ ప్రథమచికిత్స చేసేవారు కరవయ్యారు. చివరకు మన రాష్ట్ర 108 సిబ్బంది వచ్చాక ప్రథమ చికిత్స చేశారు. 24 గంటల వైద్యశాలలో సిబ్బంది లేకపోవడం ఏమిటని, ఉన్నతాధికారులు స్పందించాలని ప్రజలు కోరుతున్నారు. - న్యూస్‌టుడే, హాలహర్వి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని